దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విషయంలో అవగాహన, వాటి ప్రాధాన్యత అందరికీ తెలిసింది. అందుకే విద్యుత్ వాహనాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇప్పటికే దాదాపుగా అన్ని పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తున్నాయి. ఇప్పటివరకు స్కూటర్, కార్, ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చారు. తాజాగా ఈ లిస్టులోకి టిప్పర్ చేరింది. అవును మీరు విన్నది నిజమే.. ఎలక్ట్రిక్ టిప్పర్‌ను ఆవిష్కరించారు. బెంగళూరులో జరిగిన ఎనర్జీ వీక్ లో ఈ ఎలక్ట్రిక్ టిప్పర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో ఈ టిప్పర్ హాట్ టాపిక్ అయ్యింది.
దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ టిప్పర్ను హైదరాబాదీ సంస్థ ఆవిష్కరించింది. బెంగళూరులో జరిగిన ఎనర్జీ వీక్ లో మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈ టిప్పర్ ను విడుదలచేసింది. ఇది చూడటానికి సాధారణ టిప్పర్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. పైగా దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలో మీటర్ల ప్రయాణించగలదని చెబుతున్నారు. దీని బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. దీనిని ఇప్పుడు ఆవిష్కరించినప్పటికీ 2022 ఏప్రిల్ నుంచి దీనిపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి దీని సామర్థ్యం, పనితీరుపై ట్రయల్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
Excited to share that our Olectra Electric Tipper has received a tremendous response at #IndiaEnergyWeek Bengaluru. #OlectraEletricTipper pic.twitter.com/RFRS3qT6i7
— Olectra Greentech Limited (@OlectraEbus) February 7, 2023
ఈ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ ను ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఏ ఎక్స్ పోకి వెళ్లినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని ప్రతినిధులు చెబుతున్నారు. ఈ 6*4 ఎలక్ట్రిక్ టిప్పర్ ని గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. బస్సులు, టిప్పర్లు వంటి పెద్ద పెద్ద వాహనాలు కూడా ఎలక్ట్రిక్ గా మారడం వల్ల పర్యావరణానికి చాలా మంచి జరుగుతుందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ మాత్రం కన్ స్ట్రక్షన్ ఫీల్డ్ లో సంచలనం అవుతుందని కామెంట్ చేస్తున్నారు.
We were honored to have Shri K. T. Rama Rao Garu(Ministry of IT) to our stand at the #EV Expo in #Hyderabad ! Visit our stand-11 at Hall-2 for more information. #EVExpoHyderabad #Electric #Sustainable #EV pic.twitter.com/KcwathDhFz
— Olectra Greentech Limited (@OlectraEbus) February 8, 2023