విద్యుత్ వాహనాల వినియోగం నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. ఈవీ వాహనాల్లో ఓలా కంపెనీకి కూడా చాలా మంది గుర్తింపు లభించింది. అయితే ఇటీవల ఈ కంపెనీకి చెందిన వాహనాలపై ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం విద్యుత్ వాహనాలకు డిమాండ్ శరవేగంగా పెరుగుతోంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీలు కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వాడకం పెంచాలంటూ ప్రోత్సహింస్తోంది. అటు కంపెనీలకు రాయితీ ఇవ్వడం, ఇటు వినియోగదారులకు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఓలా కంపెనీకి మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి విడుదలైన ఓలా ఎస్1, ఎస్1 ప్రో మోడల్స్ వాహనాలకు మంచి ఆదరణ లభించింది. అయితే మొదటి నుంచి ఈ వాహనాలపై వ్యతిరేకత కూడా ఉంది.
ఓలా కంపెనీకి చెందిన ఎస్1, ఎస్1 ప్రో వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. అయితే బాగా అమ్మకాలు జరిగిన తర్వాత ఈ కంపెనీ ఎస్1 వాహనాలపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఓలా తయారీలో లోపాలున్నాయని, ఛాసిస్ అంత ధృఢంగా లేదంటూ ఎంతో మంది కంపెనీకి ఫిర్యాదులు చేశారు. ఫ్రంట్ ఫోర్క్ విరిగి రోడ్డుపై పడిన సందర్భాలను ఫొటోలు తీసి నెట్టింట తెగ వైరల్ చేశారు. ఇలాంటి విమర్శలు, ఫిర్యాదులు, వ్యతిరేకతపై ఓలా కంపెనీ తొలిసారి స్పందించింది. తమ వాహనాలు ఎంత గట్టివో చూపించేందుకు వాటికి చేసే పరీక్షలు, ఎలాంటి పరిస్థితుల్లో వాటిని టెస్ట్ చేస్తున్నారు అనే వీడియోలను కూడా విడుదల చేసింది.
Ola Electric recalls its S1 scooters to fix front fork suspension issue, offers free upgrade to the new front fork https://t.co/ErFr04iHkh pic.twitter.com/LOjJNjpNwB
— Autocar Professional (@autocarpro) March 15, 2023
అంతేకాకుండా ఓలా ఎస్1 వినియోగదారులకు ఒక శుభవార్త కూడా చెప్పింది. అదేంటంటే.. ఈ రెండు మోడల్స్ కి సంబంధించి ఫ్రంట్ ఫోర్క్ కంప్లైంట్స్ పై కంపెనీ స్పందించింది. తాజాగా ఫ్రంట్ ఫోర్క్ డిజైన్ ని ఓలా కంపెనీ అప్ గ్రేడ్ చేసింది. ఇప్పటికే ఓలా ఎస్1 వాహనాలు వాడుతున్న వాళ్లు ఈ కొత్త డిజైన్ ఫోర్క్ ని మీరు కూడా మార్చుకోవచ్చు. మీకు మీ ఓలా ఎస్1 వాహనం ఫ్రంట్ ఫోర్క్ క్వాలిటీపై నమ్మకం లేకపోతే ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఫ్రీగా మీరు సర్వీస్ సెంటర్లో ఫోర్క్ ని రీప్లేస్ చేసుకోవచ్చు. మార్చి 22 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫ్రంట్ ఫోర్క్ ని ఫ్రీగా మార్చుకునేందుకు అవకాశం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Important update about your Ola S1! pic.twitter.com/ca0jmw1BsA
— Ola Electric (@OlaElectric) March 14, 2023