Nothing Phone (1): నథింగ్ బ్రాండ్ ఇటీవల స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అదే నథింగ్ ఫోన్ (1). ఈ ఫోన్ విషయంలో ఇప్పటికే ఎన్నో నాణ్యతా పరమైన సమస్యలు వచ్చినట్లు నెటిజన్లు కంప్లైంట్ చేశారు. వినియోగదారులకు స్టేబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి కొన్ని అప్‌డేట్స్ కూడా అందించింది కంపెనీ. ముఖ్యంగా ట్రాన్స్‌ప్రంట్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ మొబైల్ ప్రియులను బాగా ఆకట్టుకుంది. దీంతో సేల్స్ పరంగాను మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో నథింగ్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. అది అప్‌డేట్ గురుంచి మాత్రం కాదు.. నథింగ్ ఫోన్ రేటు గురుంచి.
ట్రాన్స్‌ప్రంట్ బ్యాక్ ప్యానెల్ దానికి గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో కూడిన ఎల్ఈడీ స్ట్రిప్ లైట్స్. ఇంతకు ముందు ఏ ఫోన్‌లోనూ ఇలాంటి లైట్స్ సెటప్ లేదు. మొత్తంగా 900 ఎల్‌ఈడీలను ఈ స్ట్రిప్స్‌లో నథింగ్ పొందుపరిచింది. కాల్ వచ్చినప్పుడు, చార్జింగ్ పెట్టినప్పుడు, నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాక్ ప్యానెల్‌పై లైట్స్ బ్లింక్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. అందులోనూ లుక్‌పరంగా చాలా ఆకర్షణీయంగా ఫ్లాట్ ఎడ్జెస్ ఉండడంతో చూసేందుకు యాపిల్ ఐఫోన్‌ను తలపించింది. ఈ తరుణంలో నథింగ్ ఫోన్ 1కు మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో నథింగ్ కంపెనీ ఫోన్ ధరను కంపెనీ రూ.1,000 మేర పెంచింది.
ఈ నిర్ణయంతో.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999కు, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999కు, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999కు పెరిగింది.
నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్స్: