‘నథింగ్‘.. ఈ టెక్ బ్రాండ్ కొన్నాళ్ల క్రితమే ప్రపంచానికి పరిచయం అయ్యింది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు ‘కార్ల్ పై’ ఈ బ్రాండ్‌ను సృష్టించారు. ఇప్పటికే.. ఈ బ్రాండ్ నుంచి ట్రాన్స్పరెంట్ ఇయర్ పాడ్స్‌ను తీసుకురాగా మార్కెట్ లో వాటికి మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో.. నథింగ్ బ్రాండ్‌లో ‘నథింగ్ ఫోన్ 1’స్మార్ట్ ఫోన్ ను సంస్థ లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ కో ఫౌండర్ స్థాపించిన కంపెనీ కావడంతో.. ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జులై 12న ఈ మొబైల్ ను లాంచ్ చేయనున్నారు. ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానల్, వైర్ లెస్ ఛార్జింగ్.. ఇలా ఎన్నో కొత్త ఫీచర్లు ఈ మొబైల్‌లో ఉండనున్నాయి.
నథింగ్ ఫోన్ 1.. ‘నథింగ్’ బ్రాండ్ నుంచి రానున్న మొదటి మొబైల్ కావడంతో.. ఎలా ఉంటుందనే విషయంపై టెక్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్ లో రానున్న ట్రాన్స్‌ప్రంట్ డిజైన్ గురించే ప్రధాన చర్చ. దీని ధర సుమారు రూ.40వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నథింగ్ ఫోన్ 1 మొబైల్ లాంచ్ ఈవెంట్ జూలై 12న జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు ఈవెంట్ మొదలవుతుంది. నథింగ్ అధికారిక యూట్యూబ్ చానెల్‌లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. లాంచ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించిన నథింగ్.. ఏ స్పెసిఫికేషన్‌ను కూడా రివీల్ చేయలేదు. అయితే విడుదల తేదీ సమీపించే కొద్ది క్రమంగా వెల్లడించే అవకాశం ఉంది.
Unlearn. Undo. Starting with phone (1).
Nothing (event) – Return to Instinct.
Tuesday 12 July, 16:00 BST.Get notified: https://t.co/FEJL4Jb2Aw#phone1 pic.twitter.com/SX0PCdeXw9
— Nothing (@nothing) June 8, 2022
ఇది కూడా చదవండి: OnePlus Nord Buds: సూపర్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న వన్‌ప్లస్ ఇయర్ బడ్స్.. ధరెంతంటే?
అయితే, ఇప్పటికే నథింగ్ ఫోన్ 1 గురించి కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. నథింగ్ తొలి ప్రొడక్ట్ నథింగ్ ఇయర్ 1 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ లాగానే.. నథింగ్ ఫోన్ 1 కూడా ట్రాన్స్‌ప్రెంట్ డిజైన్‌తో వస్తుందని దాదాపు ఖాయమైంది. అంటే ఫోన్ లోపలి పరికరాలు కనపడేలా బ్యాక్ ప్యానెల్ ట్రాన్స్‌ప్రెంట్‌గా ఉండొచ్చు. మరోవైపు నథింగ్ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉండడం ఖాయం. అయితే ధర, ఫీచర్లపై అధికారింగా ధృవీకరణ లేనప్పటికీ ఊహాగానాలు ఇలా ఉన్నాయి.
నథింగ్ ఫోన్ 1 ఫీచర్లు(అంచనా)
ధర సుమారు రూ. 40,000 వరకు ఉండొచ్చని అంచనా. భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయానికి రానుంది. ఇప్పటికే ఆ సైట్‌లో లిస్ట్ అయింది.
The Nothing phone could fall in the Rs 40,000 price range…#TechInformer #NothingPhone1 #Nothing pic.twitter.com/MoPvKFjdRS
— Tech Informer (@Tech_Informer_) June 9, 2022