స్మార్ట్‌ఫోన్లలో వన్ ప్లస్ బ్రాండ్ ఎంత పాపులరో.. దాని మాజీ కో ఫౌండర్ కార్ల్ పీ కూడా అంతే ఫేమస్. అక్టోబర్ 2020లో వన్ ప్లస్ సంస్థ నుంచి బయటకు వచ్చిన కార్ల్ పీ నథింగ్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థను నెలకొల్పాడు. ఇప్పుడు ఈ నథింగ్ కంపెనీ నుంచి మొదటి స్మార్ట్‌ఫోన్ ‘నథింగ్ ఫోన్ 1‘(Nothing Phone 1) రానుంది. ఈ విషయాన్ని వన్‌ప్లస్ మాజీ సీఈవో, ప్రస్తుత నథింగ్ సంస్థ కో ఫౌండర్ కార్ల్ పీ (Carl Pei) వెల్లడించారు. బుధవారం వర్చువల్‌గా జరిగిన ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు.
నథింగ్ ఫోన్ 1 .. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో రానుంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌కు అతి దగ్గరగా ఉండే నథింగ్ ఓఎస్ తో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బెస్ట్ ఆఫ్ ప్యూర్ ఆండ్రాయిడ్‌గా సంస్థ పేర్కొంది. “నథింగ్ ప్రొడక్టులు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఎకో సిస్టమ్ మూసధోరణిలో ఉంది. నథింగ్ కచ్చితంగా యూజర్లకు కొత్తదనాన్ని పరిచయం చేస్తుంది. ఫ్రెష్‌నెస్ ఇస్తుంది” అని కార్ల్ పీ చెప్పారు.
లాంచ్ అప్పుడేనా..?
నథింగ్ ఫోన్ 1 మొబైల్‌ను వేసవిలో విడుదల చేస్తామని ఈవెంట్‌లో కార్ల్ పీ చెప్పారు. అయితే ఆయన బ్రిటన్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. బ్రిటన్‌లో జూలై, ఆగస్టు నెలలో వేసవి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో నథింగ్ ఫోన్ 1 విడుదల కానుంది. మరోవైపు గ్లోబల్‌గా లాంచ్ అయిన సమయంలోనే నథింగ్ ఫోన్ 1 భారత్‌లో కూడా లాంచ్ కానుంది.
You’ve speculated, and now you know.
Nothing phone (1) is officially coming.
It’s unlike anything else.
Summer 2022.
Sign up for the latest updates on https://t.co/pLWW07l8G7. pic.twitter.com/Lo4UPkk7MT
— Nothing (@nothing) March 23, 2022
టార్గెట్ వన్ ప్లస్ కాదు.. యాపిల్!
తాను గతంలో బాస్‌గా ఉన్న వన్‌ప్లస్‌ను కాకుండా యాపిల్‌ను టార్గెట్ చేశారు కార్ల్. యాపిల్‌కు ప్రత్యామ్నాయంగా గట్టి పోటీని ఇస్తూ ఎదగడమే తమ లక్ష్యమని కార్ల్ పీ చెప్పారు. నొథింగ్ సంస్థ నుంచి ఇది రెండో ప్రాడక్టు. ఇప్పటికే.. ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసి ఆడియో గాడ్జెట్స్ సెగ్మెంట్స్‌లో సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఏకంగా యాపిల్ ఐఫోన్లకు పోటీ అంటూ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు నథింగ్ సంస్థ సిద్ధమైంది. అయితే.. ఐఫోన్‌లను ఢీకొట్టేలా నథింగ్ సమస్త ఏ విధంగా స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తుందో చూడాలి. మరోవైపు ట్రాన్స్‌ప్రంట్ డిజైన్ కలిగి ఉంటుందా అన్న ఆసక్తి కూడా పెరుగుతోంది.
We’re not just an audio company.
From the very beginning, our vision has been of a world without barriers between people and tech.
If you want an ecosystem of products that connect and work seamlessly together, there’s only one choice today.
But, soon, there will be Nothing. pic.twitter.com/0HuPhmQlc8
— Nothing (@nothing) March 23, 2022
Nothing phone (1)
Concept. pic.twitter.com/M50Eyfuygg
— Ben Geskin (@BenGeskin) March 23, 2022
OnePlus former co-founder Carl Pei launches first smartphone with Qualcomm, Nothing Phone (1)
Can Nothing become a OnePlus killer? 🤔⚔️ pic.twitter.com/npXCULYnII
— Burner Bits (@burner_bits) March 23, 2022