భారతదేశంలో మెజారిటీ వ్యక్తులు వాడిన తొలి ఫోన్ కచ్చితంగా నోకియా అయ్యే అవకాశం ఉంది. నోకియా ఫోన్ తో ఎంతో మందికి మంచి అనుబంధం ఉంటుంది. కానీ, స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత నోకియా కంపెనీ ఫోన్లకు ఆదరణ పడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ మార్టెక్ లో నిలదొక్కుకునేందుకు నోకియా కంపెనీ కొత్త స్ట్రాటజీలతో రాబోతోంది.
నోకియా ఫోన్లకు ఉండే డిమాండ్, మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెక్ రంగాన్ని మొత్తాన్ని ఒక ఊపు ఊపిన కంపెనీ ఇది. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ల హవా పెరిగిన తర్వాత నోకియా కంపెనీ తన ప్రాభవాన్ని కోల్పోయిందనే చెప్పాలి. తర్వాత స్మార్ట్ ఫోన్లు తయారు చేసి మార్కెట్లో నిలదొక్కుకేన ప్రయత్నం చేసినా కూడా అది అంత సఫలీకృతం కాలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు నోకియా తమ స్ట్రాటజీని మార్చినట్లు తెలుస్తోంది. తాజాగా నోకియా తమ లోగోని మార్చడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అయితే అసలు నోకియా ఎందుకు లోగో మార్చిందో చూద్దాం.
నోకియా కంపెనీ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగిన విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఆ కంపెనీ మొబైల్ మార్కెట్ అంత ప్రభావం చూపలేకపోతోంది. అందుకు కారణం ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లు వచ్చిన కొత్తలో వారి అనుకున్నంత వేగంగా తమని తాము మార్చుకోకపోవడమే. తాజాగా అమెరికా వేదికగా జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 వేదికగా నోకియా తమ కొత్త లోగోని ఆవిష్కరించింది. దాదాపుగా 60 ఏళ్ల తర్వాత నోకియా కంపెనీ తమ లోగోని మార్చడం విశేషం. అయితే ఇందుకు పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిలో ముఖ్యంగా నోకియా తమ స్ట్రాటజీలో భాగంగానే లోగో మార్చినట్లు తెలుస్తోంది.
గతంలో నోకియా లోగో వైట్, బ్లూకలర్స్ లో చాలా సాధారణంగా ఉండేది. 60 ఏళ్లుగా అదే లోగోని నోకియా కొనసాగిస్తూ వస్తోంది. కానీ తాజాగా ఆ లోగోని మార్చింది. వివిధ రకాల బ్యాగ్రౌండ్ కలర్స్ తో, వినూత్నమైన ఫాంట్ తో ఈ కొత్త లోగోని ఆవిష్కరించారు. ఆ కంపెనీ సీఈవో మాట్లాడుతూ.. “స్మార్ట్ ఫోన్స్ కు ఒక అసోసియేషన్ ఉంది. మేము ఒక బిజినెస్ టెక్నాలజీ కంపెనీ. మేము మా ప్రణాళికలను మారుస్తున్నాం. అందులో భాగంగానే మా కంపెనీ లోగోని మార్చాం. సంస్థ వ్యూహాలు, ప్రణాళికలు మారుతున్నాయని చెప్పేందుకు సూచికగా మొదట లోగోని మార్చాం. ఈ లోగో మా సంస్థ ఐడెంటీకి చిహ్నం” అంటూ నోకియా సీఈవో వ్యాఖ్యానించారు.
Nokia new logo.#Nokia #MWC #MWC2023 pic.twitter.com/iu3RV41KHU
— Abhishek Yadav (@yabhishekhd) February 26, 2023
నోకియా కొత్త ప్రణాళికలో మొత్తం 3 దశలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. రీసెట్- స్కేల్- ఎక్సలరేట్ అనే 3 దశలు ఉంటాయని చెప్పారు. ఇప్పటికే కంపెనీలో రీసెట్ ఫేజ్ పూర్తైనట్లు తెలిపారు. ప్రస్తుతం రెండో దశ స్కేల్ వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. కస్టమర్ బేస్ ని పెంచుకుంటూ నికర అభివృద్ధి, ఆదాయం పొందడమే లక్ష్యంగా చెప్పుకొచ్చారు. తాము ఒక కొత్త బ్రాండ్ ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ సంస్థ ఇండస్ట్రియల్ డిజిటలైజేషన్, నెట్ వర్క్స్ మీద దృష్టి సారించనున్నామన్నారు. అయితే నోకియా పాత లోగో అనేది అలాగే ఉంటుందని తెలుస్తోంది. క్లాసిక్ నోకియా లోగోతోనే స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నారు. తాజాగా వచ్చిన నోకియా జీ22కి కూడా ఇదే లోగోని ఉంచారు.
This is Nokia, but not as the world has seen us before. Our new brand signals who Nokia is today. We’re unleashing the exponential potential of networks and their power to help reshape the way we all live and work. https://t.co/lbKLfaL2OI #NewNokia pic.twitter.com/VAgVo8p6nG
— Nokia #MWC23 (@nokia) February 26, 2023