మార్కెట్ లో ఇయర్ బడ్స్ డిమాండ్ బాగా పెరిగిన విషయం తెలిసిందే. అలాగే కొత్త కొత్త కంపెనీలు కూడా ఈ ఇయర్ బడ్స్ తయారీ ప్రారంభించాయి. వాటిలో నాయిస్ కంపెనీ భారత్ లో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ నాయిస్ కంపెనీ నుంచి సరికొత్త బడ్స్ విడుదల అయ్యాయి.
ప్రస్తుతం అందరూ స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ వంటి గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసేందుకు బాగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా మార్కెట్లో ఇయర్ బడ్స్ కి బాగా డిమాండ్ పెరిగింది. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా పలు కంపెనీలు సరికొత్త డిజైన్స్, మోడల్స్ తో ముందుకొస్తున్నాయి. ఈ ఇయర్ బడ్స్ తయారీలో నాయిస్ కంపెనీ అతి తక్కువ సమయంలో భారత్ లో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ నాయిస్ కంపెనీ నుంచి సరికొత్త ఇయర్ బడ్స్ మార్కెట్ లోకి వచ్చాయి. నాయిస్ కొత్తగా లాంఛ్ చేసిన ఈ నాయిస్ బడ్స్ X ఫీచర్స్, ప్రత్యేకతలు తెలుసుకుందాం.
ఇండియాలో నాయిస్ కంపెనీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఎన్నో మంచి బ్రాండ్స్ మార్కెట్ లోకి వచ్చాయి. నాయిస్ కంపెనీ ఇయర్ బడ్స్ లో భారత్ లోనే రెండోస్థానంలో ఉన్నామంటూ చెబుతున్నారు. విరాట్ కోహ్లీ- రిషబ్ పంత్ వంటి వారు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం కూడా ఈ కంపెనీ ప్రొడక్టలపై నమ్మకాన్ని పెంచింది. ఇప్పుడు ఈ నాయిస్ కంపెనీ నుంచి బడ్స్ X పేరిట ఒక కొత్త మోడల్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ బడ్స్ ఫీచర్లే కాదు.. లుక్స్ కూడా ఎంతో స్టైలిష్ గా ఉన్నాయి. ఇవి స్పేస్ థీమ్ తో తయారు చేసిన మోడల్. ఇయర్ బడ్స్ బీమ్, స్పీకర్ డిజైన్ చాలా కొత్తగా అనిపిస్తుంది. కేస్ కూడా ఏదో పాడ్ ఓపెనింగ్ మోడల్ లో ఉంది.
ఇంక ఈ ఇయర్ బడ్స్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాక్టివ్ నాయిస్ కంట్రోల్(ANC). ఇది 25 డెసిబుల్స్ వరకు యాక్టివ్ నాయిస్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే దీనిలో ఎన్విరాన్మెంటర్ నాయిస్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. బ్లూటూత్ 5.3 వర్షన్ తో వస్తున్న ఈ బడ్స్ లో 12ఎంఎం డ్రైవర్స్ ఉన్నాయి. ఇవి 35 గంటల ప్లే టైమ్ తో వస్తున్నాయి. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. 120 నిమిషాల వరకు బ్యాకప్ వస్తుంది. ఇవి బ్లాక్, స్నో వైట్ కలర్ వేరియంట్స్ లో వస్తున్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.5,499కాగా లాంఛింగ్ ఆఫర్ కింద 64 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,999కే అందిస్తున్నారు. ఈ నాయిస్ బడ్స్ X కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
Ready. Steady. Play.
Make way for an Xceptional audio experience supported by Buds X ft.
– Active Noise Cancellation
– 12mm dynamic driver
– Up to 35-hour playtime
– Quad mic and ENCand much more. Shop now at just ₹1999. Available at Amazon and https://t.co/ZB7j37MrjI. pic.twitter.com/DmFpHFh30W
— Noise (@gonoise) February 28, 2023