స్మార్ట్ వాచెస్ అందరూ కొంటున్నారు. డిమాండ్ కి తగ్గట్లు కొత్త మోడల్స్, ఫీచర్లతో స్మార్ట్ వాచెస్ మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు అంతా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తమ స్మార్ట్ వాచ్ లో తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, బడ్జెట్ లో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచెస్ రావడం లేదు. కానీ, ఇప్పుడు నాయిస్ కంపెనీ నుంచి ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఒకటి రిలీజ్ అయ్యింది.
స్మార్ట్ వాచ్ ని చేతికి స్టైల్ కోసం పెట్టుకోవడం నుంచి అవసరం కోసం వాడుకునేలా మారిపోయింది. ఇప్పుడు స్మార్ట్ వాచ్ లో మరీ ముఖ్యంగా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉండాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. అయితే ఈ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కావాలి అంటే దాదాపుగా రూ.1800 నుంచి రూ.2 వేల వరకు పెట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నాయిస్ కంపెనీ నుంచి వస్తున్న ఓ స్మార్ట్ వాచ్ మాత్రం బడ్జెట్ ధరలోనే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో అందుబాటులోకి వస్తోంది. మరి ఆ స్మాట్ వాచ్ ధర ఎంత? అందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? అనే విషయాలు తెలుసుకుందాం.
ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచెస్ తయారీలో నాయిస్ కంపెనీకి చాలా మంచి పేరు వచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీగా వీళ్ల ఉత్పత్తులు ఉంటాయని ఇప్పటికే పేరు సంపాదించుకున్నారు. నాయిస్ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ ఒకటి ఇప్పుడు మార్కెట్ లోకి విడుదలైంది. ఈ నాయిస్ ఫిట్ క్రూ స్మాట్ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే.. మెటల్ బాడీ, 1.38 ఇంచెస్ డిస్ ప్లే, 240*240 పిక్సల్స్ రెజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్ నెస్, 100 ప్లస్ వాచ్ ఫేసెస్, బ్లూటూత్ కాలింగ్ లో కూడా బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఉంటుందని చెబుతున్నారు. హార్ట్ రేట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్, పిరియడ్ సైకిల్ ట్రాకర్, 2 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. సింగిల్ ఛార్జ్ తో వారంపాటు స్టాండ్ బై ఉటుంది.
#OutNow | Get ready to #HustleTogether, with NoiseFit Crew 🙌
Shop now at just ₹1,499. Available at Flipkart.#Noise #NoiseSmartwatch #NoiseFitCrew pic.twitter.com/Zwzop5cn2d
— Noise (@gonoise) February 21, 2023
ఇంక ఈ నాయిస్ ఫిట్ క్రూ స్మార్ట్ వాచ్ ధర విషయనాకి వస్తే.. కేవలం రూ.1,499కే మార్కెట్ లో విడుదల చేశారు. ఈ వాచ్ ని బ్లూ, గ్రీన్, గ్రేన్, రోజ్ పింక్, బ్లాక్ వంటి కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇంక ఈ ధరకు సమీపంలో బోట్ కంపెనీ నుంచి ఓ బ్లూటూత్ కాలంగ్ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది. ఈ వాచ్ కు 21 వేలకు పైగా రివ్యూ, రేటింగ్ కూడా ఉంది. ఈ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే.. 1.69 హెచ్ డీ డిస్ ప్లే, 550 నిట్స్ బ్రైట్ నెస్, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్, స్పోర్ట్స్ మోడ్స్, 150+ వాచ్ ఫేసెస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ బోట్ వేవ్ కాల్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.