అద్భుతాలు చేయాలంటే వయసుతో పని లేదని మనకు ఎన్నో సార్లు రుజువైందనేది కాదనలేని వాస్తవం. ఈ కాలం పిల్లలు ఆటలు, పాటలు అంటూ జాలీగా తిరుగుతూ కనిపిస్తుంటే ఓ బుడ్డోడు మాత్రం చిన్న వయసులో మేధో సంపత్తికి పదును పెట్టి సరికొత్త ఆలోచనల దిశగా అడుగులు వేశాడు. ప్రయత్నం లేకపోతే విజయం రాదు.. కానీ ప్రయత్నిస్తే ఓటమి రాదు అన్న అబ్దుల్ కలాం మాటలు ఇక్కడ అమలు చేశాడు మనోడు.
ఇక తొమ్మిదో తరగతి చదివే ఈ చిన్నోడు మాత్రం అందరూ ముక్కన వేలేసుకునేలా ఓ సరికొత్త ప్రయత్నానికి తెర తీశాడు. వయసుతో పనిలేదంటూ అందరూ వావ్ అనేలా బ్యాటరీ బండి తయారు చేసి అందరి నుంచి శభాష్ బిడ్డా అనిపించుకుంటున్నాడు. ఇక ఈ బుడ్డోడు ఏం చేశాడు. బ్యాటరీతో నడిచే బైక్ ఎలా తయారు చేశాడన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలోని రాజన్ అనే తొమ్మిదో తరగతి చదివే బాలుడు తన పదునైన ఆలోచనలతో అద్భుతం చేశాడు.
రాజన్ పనికి రాని ఇనుప సామానులతో బ్యాటరీ బండి తయారు చేసి యువ ఇంజనీర్ లకు సవాల్ గా మారాడు. ఇక రాజన్ తన తండ్రి సాయంతో మూడు నెలల పాటు కష్టపడి రూ. 45 రూపాయల ఖర్చుతో ఈ బైక్ తయారు చేశాడు. దీంతో రాజన్ అద్భుతమైన మేధో సంపత్తికి అందరూ సలామ్ చేస్తున్నారు. రాజన్ టాలెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.