భారత్ లో ఓటీటీల హవా పెరిగిన విషయం తెలిసిందే. థియేటర్ కి వెళ్లి సినిమా చూసే వాళ్ల కంటే ఓటీటీల్లో సినిమాలు చూసే వాళ్లే బాగా పెరిగిపోయారు. అలాంటి ఓటీటీల్లో నెట్ ఫ్లిక్స్ కి ఎంతో ఆదరణ ఉండేది. కానీ, ఎక్కువ సబ్ స్క్రిప్షన్ ధరలు ఉండటం వల్ల ప్రత్యామ్నాలు వెతుక్కున్నారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వారి నెలవారీ సబ్ స్క్రిప్షన్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
నెట్ ఫ్లిక్స్.. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ కి ప్రపంచవ్యాప్తంగా కోట్లలో యూజర్లు ఉన్నారు. ముఖ్యంగా ఇండియా కూడా వీరికి ప్రధాన మార్కెట్ గా మారిన విషయం తెలిసిందే. అందుకే భారత్ కోసం ఎప్పుడూ నెట్ ఫ్లిక్స్ సరికొత్త ప్లాన్స్ ని తీసుకొస్తూ ఉంటుంది. విదేశాలతో పోలిస్తే.. భారత్ లో సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ని సరసమైన ధరలకే అందిస్తుంటారు. అయితే మిగిలిన ఓటీటీల నుంచి నెట్ ఫ్లిక్స్ కు బాగా పోటీ పెరిగింది. కరోనా తర్వాత ఆహా, హాట్ స్టార్ వంటి యాప్స్ సబ్ స్క్రైబర్లు పెరిగారు. పైగా నెట్ ఫ్లిక్స్ తీసుకురానున్న నో పాస్ వర్డ్ షేరింగ్ ఆప్షన్ కూడా భారత్ లో ఆదరణ తగ్గేలా చేస్తోంది. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. తమ సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
నెట్ ఫ్లిక్స్ కు భారీగా ఆదరణ రావడానికి కారణం ఒకటుంది. వారి దగ్గర ఎక్స్ క్లూజివ్ కంటెంట్ లభిస్తుంది. ఎన్నో ప్రముఖ వెబ్ సిరీస్ లు, హాలీవుడ్ సినిమాలు ఉంటాయి. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నిర్మించన చిత్రాలను స్ట్రీమ్ చేస్తుంటారు. కొన్నాళ్లుగా నెట్ ఫ్లిక్స్ సంస్థకు భారత్ సహా పలు దేశాల్లో ఆదరణ తగ్గింది. ప్రత్యామ్నాయ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి వెళ్లిపోతున్నారు. అందుకే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఒక నిర్ణయం తీసుకుంది. మొత్తం 115 దేశాల్లో నెట్ ఫ్రిల్క్స్ సబ్ స్క్రిప్షన్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నెట్ ఫ్లిక్స్ పాత యూజర్లు కూడా ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి నెట్ ఫ్లిక్స్ ధరలు తగ్గించింది. వాటికి అదనంగా మరోసారి ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో నెట్ ఫ్లిక్స్ మొబైల్ ఓన్లీ ప్లాన్ నెలకు రూ.199గా ఉండేది. ఇప్పుడు దానిని కేవలం రూ.149కే అందిస్తున్నారు. పీసీ, మొబైల్, ట్యాబ్లెట్ ఇలా దేనిలో అయినా లాగిన్ చేసుకునే ప్లాన్ ధర గతంలో రూ.499గా ఉండేది ఇప్పుడు దానిని రూ.199కి తగ్గించారు. 2 స్క్రీన్స్ స్టాండర్డ్ ప్లాన్ ధర రూ.499గా ఉంది. 4 స్క్రీన్స్ ప్రీమియం ప్లాన్ ధర రూ.649గా నిర్ణయించారు. ప్రస్తుతానికి నో పాస్ వర్డ్ షేరింగ్ విధానంపై భారత్ లో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కానీ, త్వరలోనే మీ అకౌండ్ పాస్ వర్డ్ షేర్ చేస్తే మాత్రం.. అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుందని నెట్ ఫ్లిక్స్ స్పష్టం చేసింది. ఇప్పుడు తగ్గిన ప్లాన్స్ ధరలతో మళ్లీ భారత్ లో సబ్ స్క్రిప్షన్స్ పెరిగే అవకాశం లేకపోలేదు.