ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సెర్చ్ ఇంజిన్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో యూజర్లు ఉన్నారు. దాదాపుగా స్మార్ట్ ఫోన్లు, డెస్క్ టాప్ లలో ఈ సెర్చ్ ఇంజిన్ నే వాడుతుంటారు. ఇప్పుడు గూగుల్ కు గట్టి షాక్ తగిలింది.
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి కోట్లలో యూజర్లు ఉన్నారు. దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్లలో దీనినే సెర్చ్ ఇంజిన్ గా వాడుతుంటారు. గూగుల్ విషయంలో గతంలోనూ చాలానే విమర్శలు- ఆరోపణలు రావడం అందరికీ తెలిసిందే. అయితే ఈ సెర్చ్ ఇంజిన్ కి ఇప్పుడు గట్టి షాకే తగిలింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ ని దుర్వినియోగం చేసినందుకు రూ.1,337.76 కోట్లు జరిమానాగా కట్టాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫైన్ కట్టేందుకు గూగుల్ కు ఎన్సీఎల్టీఏ 30 రోజులు గడువు ఇచ్చింది.
ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ మిస్ యూజ్ కు సంబంధించి గూగుల్ కు గతేడాది అక్టోబర్ 20న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూ.1,337.76 కోట్లు జరిమానా విధించింది. ఇలాంటి విషయాల్లో గూగుల్ తమ ప్రవర్తను మార్చుకోవాలని, అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని హితవు పలికింది. అయితే ఈ విషయంలో ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించగా అక్కడ గూగుల్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీఎల్ఏటీ బుధవారం గూగుల్ అభ్యర్థనను విచారించి పిటిషన్ ను తిరస్కరించింది. సీసీఐ విధించినా జరిమానా మొత్తాన్ని కట్టాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. గూగుల్ కు రూ.1,337.76 కోట్లు జరిమానా పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Google to Pay Rs. 1337.76 Crores for Anti-Competitive Policies: NCLAT upholds CCI Penalty
— Tax Scan (@tax_scan) March 29, 2023