ఎవరైనా కొత్త ఫోన్ కొనగానే పక్కనవాళ్లు అడిగే ప్రశ్నలు రెండే రెండు.. ఒకటి.. ఫోన్ ఎంత? ఇంకొకటి కెమెరా ఎలా ఉంది?. మన దైనందిన జీవితంలో ఎక్కడికి వెళ్లినా మనతో ఉండేది ఈ స్మార్ట్ ఫోనే. మన జీవితంలోని బెస్ట్ మూమెంట్స్ అయినా, సరదాగా స్నేహితులను తీసుకునే ఫొటోలు అయినా బాగా రావాలంటే మన స్మార్ట్ ఫోన్ లో మంచి కెమెరా ఉండటం తప్పనిసరి. అలాంటి బెస్ట్ కెమెరా ఫోన్ మాదంటే.. మాది అని స్మార్ట్ ఫోన్ కంపెనీలు చెబుతున్నా.. అందుకు తగ్గ క్లారిటీ ఉండేది కాదు. ఈ విషయాన్ని నిజం చేసేలా.. ప్రపంచంలోనే బెస్ట్ కెమెరా ఫోన్ ను లాంచ్ చేసింది.. మోటోరోలా. ‘మోటోరోలా ఎక్స్ 30 ప్రో’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ లో 200 మెగాపిక్సెల్ కెమెరా అందించడం విశేషం.
మోటోరోలా ఎక్స్ 30 ప్రో ధర:
మూడు వేరియంట్లలో మోటొరోలా ఎక్స్30 ప్రోను లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ 8జీబీ + 128జీబీ స్టోరేజ్ ధర 3,699 యువాన్లు (సుమారు రూ.43,600)కాగా, 12జీబీ+ 256జీబీ స్టోరేజ్ ధర 4,199 యువాన్లు (సుమారు రూ.49,500)గా ఉంది. ఇక.. హై ఎండ్ మోడల్.. 12జీబీ+ 512జీబీ స్టోరేజ్ ధర 4,499 యువాన్లు (సుమారు రూ.53,000)గా నిర్ణయించారు.
స్పెసిఫికేషన్స్, ఫీచర్స్:
6.73 అంగుళాల ఓఎల్ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. పంచ్ హోల్‌ను ముందువైపు ఫోన్ మధ్య భాగంలో అందించారు.
కెమెరాల విషయానికి వస్తే.. వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా.. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 60 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 125వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. అలాగే.. 50వాట్ వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. కేవలం ఏడు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్, 19 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్ అవుతుంది. ప్రస్తుతానికి మోటోరోలా ఎక్స్ 30 ప్రో చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఈ ఫోన్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Motorola Moto X30 Pro, Moto razr 2022, and Moto S30 Pro OFFICIAL
– Moto X30 Pro with Snapdragon 8+ Gen 1 and 200MP starts at ¥3499
– Moto Razr 2022 with Snapdragon 8+ Gen 1 starts at ¥5999
– Moto S30 Pro with Snapdragon 888+ costs ¥1999 pic.twitter.com/XQO40y5csO
— TechDroider (@techdroider) August 11, 2022
ఇదీ చదవండి: Xiaomi Mix Fold 2: శాంసగ్‌కు పోటీగా అదిరిపోయే ఫీచర్లతో షావోమీ ఫోల్డ్ ఫోన్!
ఇదీ చదవండి: Oppo: స్మార్ట్‌టీవీ మార్కెట్ లో సంచలనం.. 15 వేల ధరలో 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీ!