ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా యూజర్లకు వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం Moto E32s అనే సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. అయితే మోటోరోలా గతంలో మార్కెట్ లోకి తీసుకొచ్చిన Moto E32కి అప్ డేటేడ్ వెర్షన్ గా ఇది విడుదలైంది. 90 HZ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా వంటి అదిరిపోయే ఫీజర్లతో గురువారం విడుదలైంది. అసలు మోటోరోలా లోని ఈ కొత్త వెర్షన్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డ్యూయల్ సిమ్(నానో) స్లాట్ తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ Android 12 లో రన్ అవుతుంది. ఇది 6.5 అంగుళాల HD+(720-1,600 పిక్సెల్ లు) డిస్ ప్లేను కలిగి ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9, రిఫ్రెష్ రేట్ 90HX ఉంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉండడం విశేషం. Moto E32s అనే ఆండ్రాయిడ్ 12తో పని చేస్తుందని, రెండేళ్లపాటు యూజర్లకు సెక్యూరిటీ అప్ డేట్ లను కూడా అందజేయనున్నట్లుగా కంపెనీ హామీ ఇవ్వడం విశేషం. ఇక వీటితో పాటు ఫోన్ IP52-సర్టిఫైడ్ వాటర్ రిపెల్లెంట్ డిజైన్ ను కలిగి ఉంది. ఇక దిగ్గజ కంపెనీ అయిన Redmi 10A, Real me C31, Redmi 10 వంటి స్మార్ట్ ఫోన్ లతో ఈ Moto E32s పోటీపడునుందని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్లతో, రెడ్‌మీ నోట్ 11టీ ప్రో.. ధర ఎంతంటే?
Rumoured Will be Saying Motorola Moto E32s Launches In 2nd June 2022 in India……wait For Company Confirmation…#motoe32s pic.twitter.com/25olNa9oIs
— Me And You (@Meandyouindia) May 31, 2022
ఇక ఇండియాలో ధర విషయానికొస్తే.. మోటో ఈ32ఎస్ బేస్ వేరియంట్ 3GB RAM+32GB స్టోరేజ్ మోడల్ రూ.8,999 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. మరో విషయం ఏంటంటే? ప్రారంభ ధర ఎంత కాలం చెల్లుబాటులో ఉంటుందనే స్పష్టత మాత్రం ఇవ్వలేదు. 4GB+64GB మోడల్ కూడా వస్తుందని, ధీని ధర రూ.9,999 ఉండనున్నట్లుగా కంపెనీ తెలపడం విశేషం.