మోటరోలా కంపెనీ ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ యుగం ప్రారంభమయ్యాక కాస్త మందగించిన ఈ కంపెనీ సేల్స్ ని మళ్లీ గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారు. వివో, ఒప్పో, రియల్ మీ, రెడ్‌మీ వంటి కంపెనీల తరహాలో మోటరోలా సైతం కనీసం ప్రతి 3 నెలలకొకసారి కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. ఇప్పుడు మోటరోలా జీ సిరీస్‌లో జీ72 అనే మోడల్‌ను భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అంతేకాదు అలాంటి ఫీచర్లతో ఎంతో తక్కువ ధరకే మోటో జీ72 ఫోన్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌ను అక్టోబర్ 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. అయితే అసలు ఈ ఫోన్ ధర ఎంత? దాని ఫీచర్స్ ఏంటో చూద్దాం.
మోటరోలా నుంచి వస్తున్న ఈ మోటో జీ72లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రైమెరీగా 108 ఎంపీ+ 8ఎంపీ+ 2ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ఇంక 16 ఎంపీ ఫ్రంట్ కమెరాను అమర్చారు. అంతేకాకుండ ఈ ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే మొట్టమెదటి 10 బిట్ బిలియన్ కలర్ pOLEDతో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. మీడియాటెక్ హీలియో జీ99.. 2.2 హెట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12తో వస్తోంది. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ తో అందుబాటులోకి వస్తోంది. ఈ స్టోరేజ్ ని 1 టెరాబైట్ వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.
Moto G72 Launched today.
6.55″ FHD+ 120hz 10-Bit pOLED
108+8+2 / 16MP Front
Helio G99
5000mAh/33W
In-Display FP
Android 12₹18,999 for 6/128GB
Your thoughts on the pricing? pic.twitter.com/CJqRadJ0K9
— Naman Dwivedi (AndroWide) (@naman_nan) October 3, 2022
ఈ ఫోన్ అక్టోబర్ 12 నుంచి ఫ్లిప్ కార్ట్ లో సేల్‌కి రాబోతుంది. ఈ ఫోన్ ధరను మోటరోలా కంపెనీ రూ.18,999గా నిర్ణయించింది. లాంఛ్ సందర్భంగా సెలక్టివ్ బ్యాంక్సు నుంచి రూ.1,000 ఇన్‌స్టెంట్ డిస్కౌంట్‌ని అందిస్తున్నారు. వీటితో పాటుగా రూ.3,000 వేల వరకు ఎక్స్ ఛేంజ్ తగ్గింపు కూడా పొందవచ్చు. అంతేకాకుండా మింత్రా, జియో, జీ5 వంటి సంస్థల నుంచి అదనపు క్యాష్‌బ్యాక్, కూపన్స్ వంటివి కూడా పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ ఫీచర్లను బట్టి చూస్తే ప్రస్తుతం మార్కెట్‌లో ఫోన్ ధర రూ.20 వేలకు పైగానే ఉంటుంది. కానీ, మోటో జీ72ని కేవలం రూ.18,999కే అందిస్తోంది. ఆఫర్లు పోను ఈ ఫోన్‌ని దాదాపు రూ.16,999కే పొందవచ్చు. అంతేకాకుండా మోటో జీ71 5జీ మొబైల్‌ని కూడా అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఇలా వరుస మోడళ్లను అతి తక్కువ ధరకే అందిస్తూ పోతే మోటో కూడా స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో లీడింగ్ సెల్లర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Moto G72 😍 launching tomorrow @motorolaindia ❤️ pic.twitter.com/sNRdoJA6eA
— Prabh Virk (@perfect_gadget) October 2, 2022
moto g72 with 6.6″ FHD+ 120Hz OLED display, Helio G99, 6GB RAM, 5000mAh battery launched in India for Rs. 18999 https://t.co/kKcwThnLqz pic.twitter.com/GqvCZxyXDx
— FoneArena Mobile (@FoneArena) October 3, 2022
Moto G72 Launched in India
Some Highlights
– 6.55″ FHD+ 120Hz 10-bit pOLED Display
– MediaTek Helio G99 SoC
– 108MP Triple Rear Camera
– 5000mAh battery
– In-Display Fingerprint Scanner
– and for more -> https://t.co/aGgZbJDvAxPrice
– 6GB+128GB = ₹18,999#MotoG72 pic.twitter.com/YWm3kGw64Y— 🇮🇳Dahodian Techie🇮🇳 (@DahodianTechie) October 3, 2022