స్మార్ట్ ఫోన్ కొనాలని అందరికీ ఉంటుంది. కానీ, వాటి ధరే కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటికే చాలా కంపెనీలు బడ్జెట్ రేంజ్ లో స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మోటరోలా కంపెనీ నుంచి కూడా ఒక బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఒకటి రిలీజ్ అయ్యింది.
స్మార్ట్ ఫోన్ గురించే అంటే నమ్మకంగా చెప్పలేం గానీ.. ఫీచర్ ఫోన్ అంటే మాత్రం మోటరోలాకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే స్మార్ట్ యుగం మొదలైన తర్వాత మోటరోలా క్రేజ్ తగ్గిపోయింది. అయితే ఈ కంపెనీ తిరిగి పుంజుకుంటోంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తూ తిరిగి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా మోటరోలా నుంచి రూ.10 వేలలోపు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఒకటి రిలీజ్ అయ్యింది. మధ్యతరగతి మార్కెట్ ని టార్గెట్ చేస్తూ మోటరోలా జీ13 అనే మోడల్ ని రిలీజ్ చేశారు. అసలు ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.
మోటరోలా కంపెనీ నుంచి ఇప్పటికే చాలా బడ్జెట్ ఫోన్స్, బెస్ట్ డీల్స్ వచ్చాయి. ఇప్పుడు తాజాగా మోటో కంపెనీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ మోటరోలా జీ13 మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఒకటి 4 జీబీ ర్యామ్- 64 జీబీ స్టోరేజ్, రెండో వేరియంట్ లో ర్యామ్ అలాగే 4 జీబీ ఉంటుంది. కానీ, స్టోరేజ్ మాత్రం 128 జీబీగా వస్తోంది. ఈ రెండు వేరియంట్లలో ఫీచర్లు అన్నీ ఒకేలా ఉంటాయి. కానీ, స్టోరేజ్ ఎక్కువ కావాలి అనుకునే వారికి 128 జీబీ వేరియంట్ బాగుంటుంది. పీఎంఎంఏ గ్లాస్ బాడీతో వస్తోంది. చూసేందుకు ఈ ఫోన్ బాడీ- డిజైన్ కూడా ఎంతో కొత్తగా, ఎలిగెంట్ గా ఉంది.
ఇంక మోటరోలా జీ13 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 576 హెట్జ్ టచ్ శాంపిలింగ్ రేట్ తో వస్తోంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ తో నడుస్తుంది. దీనిలో బ్యాక్ సైడ్ 50 ఎంపీ మెయిన్ కెమెరా- 2 ఎంపీ మ్యాక్రో- 2 ఎంపీ డెప్త్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కమెరా ఉంది. డాల్బీ ఆటమ్స్ డ్యూయల్ స్ట్రీరియో స్పీకర్స్ ఉన్నాయ. సౌడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, మోటో ఫీచర్స్, ఐపీ52 డస్ట్- వాటర్ రెసిస్టెన్స్ తో వస్తోంది. ఇంక ఈ ఫోన్ 128 జీబీ వేరియంట్ ధర రూ.10,999కాగా రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. 64 జీబీ వేరియంట్ ధర రూ.9,499కాగా దీనిపై కూడా రూ.వెయ్యి బ్యాంక్ డిస్కౌంట్ ఉంది.