స్మార్ట్ ఫోన్.. మార్కెట్ లోకి రోజుకొక కొత్త ఫోన్లు వచ్చి వినియోగదారులను ఊరిస్తూ ఉంటాయి. ప్రతి కంపెనీ కనీసం నెలకు ఒక స్మార్ట్ ఫోన్ మోడల్ ని అయినా విడుదల చేస్తోంది. వాటిలో కొన్ని ఖరీదైన ఫోన్లు ఉండగా.. కొన్ని మాత్రం బడ్జెట్ మోడల్స్ ఉంటున్నాయి. ఇప్పుడు మోటరోలా నుంచి అలాంటి ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అని చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పచ్చు. ఎందుకంటే కేవలం రూ.7 వేలు, రూ.8 వేలల్లో స్మార్ట్ ఫోన్ మోడల్స్ ను తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మోటరోలా.. గతంలో ఈ కంపెనీ ఫోన్లంటే మార్కెట్ మంచి డిమాండ్ ఉండేది. ఫీచర్ ఫోన్లలో మోటరోలా కంపెనీ అగ్రగామిగా మెలిగింది. కానీ, స్మార్ట్ ఫోన్ యుగంలోకి అడుగుపెట్టిన తర్వాత దాని ప్రాభవం కోల్పోయింది. ఇప్పుడు తిరిగి పోటీ ప్రపంచంలోకి మోటరోలా కంపెనీ అడుగుపెట్టింది. వరుస మోడల్స్ విడుదల చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అటు ప్రీమియం ఫోన్లను తీసుకొస్తూనే.. మధ్యతరగతి వాళ్లకోసం బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. అందులో భాగంగా తాజాగా మోటరోలా e13 D అనే స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. దీని అమ్మకాలను ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించనున్నారు.
మోటరోలా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ #Motoe13 విడుదల. 2+32 వేరియంట్ రూ.6,999, 4+64 వేరియంట్ ధర రూ.7,999. 5000mah బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కలదు. సేల్ Feb 15 ప్రారంభంకానుంది. #flipkart సహా పలు ఆన్ లైన్, రిటైల్ స్టోర్లలో పొందవచ్చు.#smartphone #TeluguNews #sumantv #motorola
— SumanTV (@SumanTvOfficial) February 8, 2023
ఈ మోటో ఈ13 2+32, 4+64 వేరియంట్లలో రానుంది. మిగిలిన ఫీచర్లు అన్నీ రెండు వేరియంట్లలో దాదాపుగా సమానంగానే ఉంటాయి. ఈ ఫోన్ 6.5 ఇంచెస్ ఎల్సీడీ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ స్పీడ్ ఛార్జింగ్, 60 హెట్స్ రిఫ్రెస్ రేట్, వాటర్ డ్రామ్ నాట్చ్ ఫ్రంట్ కెమెరా, డార్క్ రూమ్ లో సెల్ఫీ, వీడియోకాల్ కోసం ఫ్రంట్ ఫ్లాష్ కూడా ఉంది. ప్రస్తుతం దీనిని ఆండ్రాయిడ్ 12తో వస్తోంది. దీనిని తర్వాత ఆండ్రాయిడ్ 13కి కూడా అప్ డేట్ చేసుకోవచ్చు. 13ఎంపీ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తోంది. ప్రస్తుతం ఈ మోటో ఈ13 స్మార్ట్ ఫోన్ టెక్ మార్కెట్ లో సంచలనంగా మారింది. దీని ఫీచర్లను ధరతో పోలిస్తే.. చాలా స్మార్ట్ ఫోన్లకంటే తక్కువ అంటూ కితాబిస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి వీటిని ఫ్లిప్ కార్ట్ వంటి ఇ-కామర్స్, రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయచ్చు.
The best phone in India under 8K – the king of budget phones #MotoE13 is here!! Waiting to buy it on 15th Feb. pic.twitter.com/x843l9ND7H
— Himanshu Hirpara (@HimanshuHirpara) February 8, 2023