ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఓ వస్తువు. మరి ఇప్పుడు వాచ్ చేయలేని పనంటూ ఏదీ లేదు. మీరు రోజుకు ఎన్ని గంటలు పడుకుంటున్నారు, ఎంతసేపు నడుస్తున్నారు, ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయి. ఇలా ప్రతీ విషయాన్ని చెప్పేస్తున్నాయి. దీంతో స్మార్ట్ వాచులపై మక్కువ చూపే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్టైలిష్ లుక్ కోసం కొందరు.. ఆరోగ్యంపై శ్రద్ధతో మరికొందరు.. వీటిని కొంటున్నారు. ఈ క్రమంలో భారతీయ టెక్ బ్రాండ్ ‘మివీ’ తన తొలి స్మార్ట్ వాచ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,299 మాత్రమే.
దేశీయ మార్కెట్ లో పదుల సంఖ్యలో బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లు అందబాటులో ఉన్నాయి. ఇందులో యాపిల్, శాంసంగ్ మినహాయిస్తే.. మిగిలిన అన్ని కంపనీల స్మార్ట్ వాచ్ ల ధరలు అందుబాటు ధరలోనే ఉంటాయి. రూ. 2,500 నుంచి రూ. 3,500 ధరకు లభిస్తున్నాయి. అయినప్పటికీ చాలామంది ధర ఎక్కువ అన్న ఉద్దేశ్యంతో.. వీటిని సొంతం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో భారతీయ టెక్ బ్రాండ్ ‘మివీ’ తక్కువ ధరలో.. అదిపోయే ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది. దీని ధర ఎన్త తక్కువో.. దీని బరువు కూడా అంతే తక్కువ.
Here it is, the best version of you is finally out. The Mivi Smartwatch Model E. Launching soon. #Mivi #tech #newtechnology #Smartwatch #MadeInIndia #PushTheLimits pic.twitter.com/peKeUcK1BB
— Mivi (@Mivi_Official) November 27, 2022
‘మివీ Model E‘ గా పిలువబడే ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.69 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే అందించారు. ఈ వాచ్ IP68 రేటింగ్‌తో వస్తుంది. వాటర్ ప్రూఫ్ ను సైతం కలిగి ఉంది. బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ అందించబడింది. ఇందులో 200 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ అందించారు. ఈ స్మార్ట్‌వాచ్ 100% ఛార్జ్ కావడానికి 1.5 గంటల సమయం పడుతుందని, 5-7 రోజుల పాటు బ్యాకప్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. అలాగే.. స్టాండ్‌బై సమయం 20 రోజులని తెలిపింది. కంపెనీ దీన్ని 6 కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది. పింక్, బ్లూ, రెడ్, గ్రే, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
ఇందులో 120 స్పోర్ట్స్ మోడ్ ఆప్షన్స్ ఉన్నాయి. సైక్లింగ్, జాగింగ్, హైకింగ్, వాకింగ్, యోగా.. వంటి పలు వర్కవుట్ మోడ్‌లు ఉన్నాయి. అలాగే.. స్టెప్ కౌంట్‌ని ట్రాక్ చేయడం, నిద్ర, హృదయ స్పందన రేటు, రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇవే కాకుండా.. మహిళల పీరియడ్స్‌ను సమయాన్ని పర్యవేక్షించే ఫీచర్ అందించారు. ఇది 28 భాషలకు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అద్భుతమైన ఫీచర్లతోనే కాదు.. లుక్ పరంగానూ ఆకట్టుకుంటోంది.
@Mivi_Official Mivi Model E Smartwatch Launching on 1st December just 1299 only Kamal ki Pricing hai….. Vaise Review bahot jaldi Channel pe Aayega 🔥 pic.twitter.com/pM5TaQUFF8
— Atul Tech ₿azaar 🇮🇳 (@Atulbazaar) November 29, 2022