ఎలక్ట్రిక్ కార్లకు ఇప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్రారంభించాయి. చాలా కంపెనీల మోడల్స్ రోడ్లపై సవారీ చేస్తున్నాయి. భారత్ లో ఆ జాబితాలో ఎంజీ మోడల్ కారు కూడా చేరనుంది. ఎంజీ నుంచి కామెట్ ఈవీ మోడల్ రిలీజ్ కానుంది.
మోరిస్ గరాజ్.. ఈ బ్రిటిష్ ఆటో మోటివ్ కంపెనీకి ఇండియాలో కూడా చాలా మంచి ఆదరణ లభించింది. ఎంజీ మోడల్స్ కు భారత మార్కెట్ లో డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఎంజీ కూడా ఎలక్ట్రిక్ మోడల్స్ మీద పని చేస్తున్న విషయం తెలిసిదే. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి కూడా ఒక ఎలక్ట్రిక్ కారు రాబోతోంది. అది కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఈ ఎలక్ట్రిక్ కారు ఉండటం విశేషం. ఎందుకంటే ఎంజీ నుంచి వచ్చేసివి కాస్త ప్రీమియం కార్లు. ఈ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ కారు అంటే కచ్చితంగా మినిమం ధర ఉంటుందని అనుకుంటారు. కానీ, ఎంజీ మాత్రం బడ్జెట్ లోనే ఈ ఈవీని తీసుకురానున్నట్లు ఆటోమెబైల్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
ఎంజీ నుంచి కామెట్ ఈవీ పేరిట ఒక కొత్త ఎలక్ట్రిక్ మోడల్ మార్కెట్ లోకి రాబోతోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఏప్రిల్ నెలలో మార్కెట్ లాంఛ్ కానున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ 2 డోర్ హ్యాట్చ్ బ్యాక్ ఈవీపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అంతర్జాతీయంగా మాత్రం ఈ కారులో 40 పీఎస్ ఎలక్ట్రక్ మోటర్ తో 17.3 కిలో వాట్స్, 26.7 కిలో వాట్స్ బ్యాటరీ కెపాసిటీతో వేరియంట్స్ ఉన్నాయి. ఇండియాలో కూడా ఇలాంటి వేరియంట్స్ అందుబాటులో ఉంటాయి అనే కచ్చితంగా చెప్పే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఈ కారు గురుగ్రామ్ లో టెస్ట్ రైడ్ చేస్తుండగా కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. చాలా మంది ఈ మోడల్ పై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
ఈ కారు ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 1.25 ఇంచెస్ ఫ్లోటింగ్ డిస్ ప్లే ఉంటుంది. ఆటో ఏసీ, టెక్ కనెక్ట్, స్ట్రీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉండచ్చు. ఈ కారులో దాదాపు 5 కలర్ వేరియంట్స్ అందుబాటులో ఉంటాయి. వైట్, పీచ్ పింక్, లెమన్ ఎల్లో, ఆవకాడో గ్రీన్, గ్యాలెక్సీ బ్లూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈవీ 200 నుంచి 300 కిలోమీటర్ల రేంజ్ తో వస్తుందని అంచనా. ఈ మోడల్ లో ఆటోమేటిక్ వర్షన్ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇంక ధర విషయానికి వస్తే.. దీని బేస్ వేరియంట్ ధర రూ.9 లక్షలు ఉంటుందని లీకులు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ ఎలక్ట్రిక్ కారుకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నెల మూడోవారంలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
The Gen Z would absolutely love this cool camouflage and graffiti designs on the MG’s upcoming EV Comet.
What do you think?@MGMotorIn pic.twitter.com/YUPnzRwdrq— Tech Singh (@mrtechsingh) April 3, 2023