ఎప్పటికప్పుడు సరి కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. అదే “వాయిస్ స్టేటస్ అప్‌డేట్స్”. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు వాయిస్ నోట్స్‌ను స్టేటస్ అప్‌డేట్స్‌గా పెట్టుకోవచ్చు. టైప్ చేయడం ఇష్టం లేని వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వాట్సాప్ స్టేటస్‌లో ఫోటోలు, వీడియోలు మాత్రమే పోస్ట్ చేసే అవకాశం ఉంది. ఇకపై వాయిస్ నోట్‌ను సైతం వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవచ్చని వాట్సాప్ అప్‌డేట్స్ వివరాలు అందించే వాబీటాఇన్ఫో తెలిపింది.
వాబీటాఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. యూజర్లు స్టేటస్‌లో టెక్ట్స్‌తో పాటు 30 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ను పోస్ట్ చేసుకోవచ్చు. ఫోన్ వాట్సాప్ కీబోర్డులో టెక్ట్స్ టైప్ చేసే ఐకాన్ కింద భాగంలో మైక్రోఫోన్ సింబల్‌పై క్లిక్ చేస్తే వాయిస్ చెప్పొచ్చని, అదే వాయిస్‌ను స్టేటస్‌గా పెట్టుకోవచ్చని వెల్లడించింది. ‘వాయిస్ నోట్’ అంటే ఏం లేదండి. ఉదాహరణకు మీకు పాటలు పాడటం ఇష్టమనుకోండి.. ఓ 30 సెకన్లు పాట పడేసి స్టేటస్ గా పెట్టుకోచ్చన్నమాట. దీంతో ఎదుటివారికి మీ అభిరుచిని తెలియజేసినట్లు ఉంటుంది. మీ గొంతును వారికి పరిచయం నట్లుంటుంది. అలాగే.. వాయిస్ నోట్ ప్రైవసీ గురించి యూజర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాయిస్ స్టేటస్‌ను వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి స్టేటస్ అప్‌డేట్‌గా షేర్ చేసిన వాయిస్ నోట్‌లు 24 గంటల తర్వాత ఆటోమేటిక్ గా డిసప్పియర్ అవుతాయి.
📝 WhatsApp beta for Android 2.23.2.8: what’s new?
WhatsApp is releasing the ability to share voice notes via status updates to some lucky beta testers!https://t.co/ZHmQu368oz pic.twitter.com/ETsDLogxbC
— WABetaInfo (@WABetaInfo) January 18, 2023
ఈ ఫీచర్ పొందాలనుకునేవారు గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ 2.23.2.8 వాట్సాప్ బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని వాబీటా ఇన్ఫో వెల్లడించింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోవు రోజుల్లో యూజర్లందరికి అందుబాటులోకి రానుంది. కాగా, వాట్సాప్ మరోవైపు బ్లాక్ షార్ట్‌కట్స్, కెమెరా to వీడియో ఈజీ స్విచ్ అనే రెండు కొత్త ఫీచర్ కూడా రిలీజ్ చేస్తోంది.
According to a report by WABetaInfo, #WhatsApp is rolling out a new update through the Google Play Beta Program through which people will be able to share voice notes via status updates. @WhatsApp @GooglePlay pic.twitter.com/ZjyYjW0ffV
— G Plus (@guwahatiplus) January 19, 2023