ప్రముఖ ఆటో కంపెనీ మహీంద్రా మార్కెట్ లోకి అదిరిపోయిన ఫీచర్స్ తో మహీంద్రా XUV 700ని ప్రవేశ పెట్టింది. తాజాగా ఇది మార్కెట్ లోకి రావటంతో పెద్ద ఎత్తున అమ్మడవుతున్నాయని మహీంద్రా కంపెనీ తెలిపింది. అదిరిపోయిన ఫీచర్ లతో ఆకట్టుకుంటున్న ఈ కారుపై ఇప్పుడు అందరి చూపులు పడ్డాయి. ఇక ఈ కారులో ఉన్న ఫీచర్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహీంద్రా కంపెనీలో ఏ కారులో లేని ఫీచర్ లు ఈ కారులో భిన్నంగా ఉన్నాయి. డ్యూయల్ HD స్క్రీన్‌లు, అడ్రినోఎక్స్ ఇన్ఫోమాటిక్‌ను కలిగి ఉంటాయి, ఇది అలెక్సా వాయిస్ AI తో సపోర్ట్ చేస్తున్న భారతదేశంలో మొదటి కారు. అలెక్సాకు కమాండ్స్ ఇవ్వడం ద్వారా, XUV700 కస్టమర్‌లు విండో , క్యాబిన్ ఉష్ణోగ్రతతో సహా కారు , ఇతర విధులను ఈ కారు నియంత్రించగలరు. అయితే ఈ కారు మైలేజ్ విషయానికోస్తే 40-80 రావచ్చిన నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇక కారులో ఉన్న ఇన్ సైడ్ ప్రత్యేకతలు కూడా అదిరిపోయాయి. సీటు అడ్జెస్ట్ మెంట్ ను బటన్ సాయంతో అడ్జస్ట్ చేసుకొవచ్చని తెలుస్తోంది. ఇక కారులో ఉన్న స్టీరింగ్ పక్కనే మొబైల్ ఆపరేట్ చేసుకోవటానికి కూడా ఈ కారులో వెసులు బాటు కల్పించారు. ఇక ఈ కారులో ఆరు గేర్ లో కలిగి ఉన్నాయి. ఇక అనేక ఎన్నో ఫీచర్స్ తో అదిరిపోతున్న ఈ కారును కొనుగోలు చేసేందుకు మార్కెట్ లో క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది.