దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ద్రుష్టి సారించడంతో ఎలక్ట్రిక్ వాహనాల రంగ జోరందుకుంది. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ ఆటమ్ ఎలక్ట్రిక్ వెహికల్ ను పరిచయం చేసింది.
మహీంద్రా ఆటమ్
K1, K2, K3, K4 అనే నాలుగు వేరియంట్లలో మహీంద్రా ఆటమ్ ను అందుబాటులోకి తేనుంది. మొదటి రెండు వేరియంట్‌లు 7.4 kWh బ్యాటరీతో రానుండగా.. తర్వాత రెండు మోడల్స్ 11.1 kWh బ్యాటరీతో రానున్నట్లు తెలిపింది. త్వరలోనే భారత మార్కెట్‌లో ఆటమ్ ను విడుదల చేయనుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: Tata Avinya: టాటా నుంచి మరో సూపర్ కార్.. అరగంట ఛార్జింగ్‌తో 500 కి.మీ. జర్నీ!
ధర: రూ. 3 లక్షల వరకు!
మహీంద్రా ఆటమ్ డిజైన్, ఫీచర్ల పరంగా పైసా వసూల్ కారుగా చెప్పవచ్చు. దీని ధర దాదాపు రూ.3 లక్షల వరకు ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహీంద్రా ఆటమ్ గరిష్ట వేగం గంటకు 50 కి.మీ. గా ఉంటుంది. దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఆటమ్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ. వరకు నడుస్తుంది.
ఆటమ్‌తో పాటు, మహీంద్రా ఇ-ఆల్ఫా మినీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఎలక్ట్రిక్ ఆల్ఫా టిప్పర్‌ను పరిచయం చేసింది. ఇ-ఆల్ఫా మినీ టిప్పర్ 1.5 kWh బ్యాటరీతో రానుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ మైలేజీ ఇస్తుంది. లోడింగ్ కెపాసిటీ 310 కిలోలుగా పేర్కొన్నారు. అయితే.. ఇది మార్కెట్లోకి ఎప్పుడు విడుదల కానుందనే విషయాన్ని కంపెనీ ప్రకటించలేదు.
Mahindra Atom Electric Launch Soon – Variants, Battery Specs Leak https://t.co/ZB5PgjMgVT pic.twitter.com/njNQtm4w82
— RushLane (@rushlane) May 6, 2022