పండగలు, ప్రత్యేక దినాలు వస్తున్నాయి అంటే ఇ-కామర్స్ సైట్స్ అన్నీ ఆఫర్స్ ప్రకటించేస్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్ పై అద్భుతమైన డిస్కాంట్స్ ఇస్తూ ఉంటాయి. ఇప్పటికే కొన్ని ఇ-కామర్స్ సైట్స్ రిపబ్లిక్ డే సేల్ పూర్తవగా.. ఇప్పుడు లావా కంపెనీకి చెందిన ఇయర్ బడ్స్ పై అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. గణతంత్ర దినోత్సం సందర్భంగా ప్రోబడ్స్ ని కేవలం 26 రూపాయలకే అందించనున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
లావా కంపెనీ గతేడాది మార్చి నెలలో తన సబ్ బ్రాండ్ ప్రోబడ్స్ పేరిట ఆడియో గాడ్జెట్స్ విక్రయాలు ప్రారంభించింది. వీటి ఎమ్మార్పీ రూ.2,199కాగా ప్రస్తుతం ఇ-కామర్స్ సైట్లలో రూ.999కి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిపై మరోసారి క్రేజీ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా లావా ఇంటర్నేషనల్ వారి ప్రోబడ్స్ 21పై ఈ ఆఫర్ ని ప్రకటించాయి. ప్రోబడ్స్ 21ని కేవలం రూ.26కే పొందవచ్చని ప్రకటించాయి. అది జనవరి 26న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇవి ఆఫర్లో ఉంటాయని తెలిపింది. ఈ లావా ప్రోబడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లావా అధికారిక వెబ్ సైట్ మరియూ ఇ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇక్కడ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ కింద లిమిటెడ్ పీస్‌లను మాత్రమే ఉంచుతారని, వారు ఆఫర్లో పెట్టిన ఇయర్ బడ్స్ బుక్ అయితే మళ్లీ సాధారణకే విక్రయిస్తామన్నారు. ఈ ప్రోబడ్స్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 60 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 గంటల ప్లేటైమ్, టచ్ కంట్రోల్, టైప్ సీ ఛార్జింగ్, వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఇయర్ బడ్స్ ఇంత తక్కువ ధరకు దొరకడం బెస్ట్ డీల్ అంటూ టెక్ నిపుణులు చెప్తున్నారు.
Avail Probuds 21 at only ₹26 in the upcoming Republic Day on Amazon & Lava E-store at 12 PM.
Mark the time to grab yours!
*Offer valid till stocks last.https://t.co/67MP5qxEDF#RepublicDaySale #ExploreUninterrupted #Probuds pic.twitter.com/o0Do28Mrga— Lava Mobiles (@LavaMobile) January 24, 2023