చాట్ జీపీటీని ఒక ఏఐ చాట్ బాట్ గా మాత్రమే చాలా మంది చూస్తున్నారు. కానీ, కొంతమంది మాత్రం దానిని ఒక మనీ ఎర్నింగ్ మిషన్ గా భావిస్తున్నారు. అలాగే వాళ్లు లక్షలు కూడా సంపాదిస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి ఏకంగా చాట్ జీపీటీ మీద రూ.28 లక్షలు సంపాదించాడు.
చాట్ జీపీటీ.. టెక్ రంగంలో ఈ పేరు ఒక సంచలనం. దేశవిదేశాల్లో ఉన్న టెక్ దిగ్గజాలు అంతా ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మీదే పెట్టుబడులు పెడుతున్నారు. ఓపెన్ ఏఐ రూపొందించిన ఈ చాట్ జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ పెరిగింది. ఇప్పటికే చాట్ జీపీటీ 4ని కూడా విడుదల చేశారు. మైక్రోసాఫ్ట్ వాళ్లు తమ బింగ్ సర్వర్ లో ఈ చాట్ జీపీటీని ఇన్ క్లూడ్ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ బింగ్ లో ఈ చాట్ జీపీటీని యాక్సెస్ చేసేందుకు కోట్ల మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఇప్పుడు చాట్ జీపీటీ టాలెంట్ ని పొగిడే రోజులు పోయాయి. ఇప్పుడు అందరూ చాట్ జీపీటీతో సంపాదన ప్రారంభించారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా రూ.28 లక్షలు సంపాదించాడు. అది కూడా కేవలం మూడు నెలల్లోనే అంత మొత్తాన్ని పొందడం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
చాట్ జీపీటీపై ఉన్న క్రేజ్ ని 23 ఏళ్ల లాన్స్ జంక్ క్యాష్ చేసుకున్నాడు. ఎంతో మందికి చాట్ జీపీటీ అంటే తెలుసు. కానీ, దానిని ఎలా ఉపయోగించాలి అనేది తెలియదు. ఆ విషయాన్ని తన ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. లాన్స్ జంక్ చాట్ జీపీని వినియోగించడం ఎలా అంటూ ఒక కోర్స్ తయారు చేశాడు. అందులో బిగినర్స్ కోసం ఒక 50 వీడియోలను రూపొందించాడు. ఈ కోర్సును రూ.3,199 ధరతో ఉడెమీలో అందుబాటులో ఉంచాడు. ఈ కోర్సు నేర్చుకునేందుకు భారత్- కెనడా- ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి ఔత్సాహికులు కొనుగోలు చేశారు. అలాగే 20 నుంచి 50 ఏళ్ల వయసు వాళ్లు ఉండటం విశేషం. దాని ద్వారా అతనికి ఏకంగా రూ.28 లక్షల సంపాదన వచ్చింది. ఆ కోర్సను రూపొందించేందుకు లాన్స్ కు కేవలం 3 నెలల సమయం మాత్రమే పట్టిందంట. అయితే చాట్ జీపీటీ మీద అతను సంపాదించాడు.
కానీ, చాట్ జీపీటీతో లక్షాధికారి ఎలా అవుతారు అని అంటారా? అయితే చాట్ జీపీటీ అనేది ఏఐ చాట్ బాట్. అది మీ ప్రశ్నలు, అవసరాలకు తగిన సలహాలు ఇవ్వగలదు. మీ బిజినెస్ ఐడియా చెబితే మిమ్మలని గైడ్ చేయగలదు. మీ బడ్జెట్ చెబితే మీకు బిజినెస్ ఐడియాలు ఇవ్వగలదు. రూపాయి పెట్టుబడి లేకుండా చేసే బిజినెస్ ఐడియాలు కూడా కోకొల్లలు ఇస్తుంది. ఇప్పటికే చాట్ జీపీటీ సాయంతో సంపాదన ప్రారంభించిన వాళ్లు చాలా మందే ఉన్నారు. చాట్ జీపీటీ మీద లాన్స్ జంక్ రూ.28 లక్షలు సంపాదించినట్లు దాని సాయంతో కూడా లక్షాధికారి కావచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. లాన్స్ జంక్ ఐడియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Lance Junck earned over $35,000 (Rs 28 lakh approximately) in just three months by teaching ChatGPT. pic.twitter.com/0E2ZEVp9mp
— Marketing Maverick (@MarketingMvrick) April 1, 2023