‘లూనా’ ఈ బైక్ గురించి తెలియని వారుండరు. 50 సీసీ ఇంజన్‌తో 1972లో భారత వాహన రంగంలోకి అడుగుపెట్టిన ఈ మోపెడ్, 30 ఏళ్ల పాటు భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసించింది. సామాన్యులు ఎక్కువగా దీనిని ఇష్టపడేవారు. పెట్రోల్ అయిపోతే..సైకిల్ మాదిరిగా తొక్కుకపోయే సౌకర్యం ఉండేది. అయితే.. రాను.. రాను.. టెక్నాలజీ పరంగా ఇతర కంపెనీలు ముందుకు సాగడంతో పోటీ తట్టుకోలేక కైనెటిక్ సంస్థ లూనా బైకుల ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే కైనెటిక్ లూనా సరికొత్తగా ఎలక్ట్రిక్ బైక్ రూపంలో కమ్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కైనెటిక్ లూనా వచ్చే ఏడాది మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వనుందని కైనెటిక్ గ్రూప్‌లో భాగంగా ఉన్న మోటోరాయల్ ఎమ్‌డీ అజింక్యా ఫిరోడియా వెల్లడించారు. ఇప్పటికే అహ్మదాబాద్ కేంద్రంగా వీటి ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలుస్తోంది. మెయిన్ స్టాండ్, సైడ్ స్టాండ్, స్వింగ్ ఆర్మ్ భాగాలను సైతం తయారు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. తొలుత నెలకు 5,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రత్యేకంగా అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. వచ్చే 2- 3 ఏళ్లలో లూనా విక్రయాల ద్వారా అదనంగా రూ.30 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంజిక్య ఫిరోడియా అంచనా వేశారు.
అందుతున్న సమాచారం ప్రకారం కైనెటిక్ లూనా బైక్‌కు స్వాపబుల్ లిథియం అయాన్ బ్యాటరీలను అమర్చనున్నారు. ఇది 1kW శక్తిని అందించనుంది. ఈ బైక్ టాప్‌స్పీడ్ 25 కెఎమ్‌పీహెచ్. సింగిల్ ఛార్జ్‌తో 70 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్‌ను సపోర్ట్‌ను చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు వేరియంట్లలో లూనా మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కైనెటిక్ లూనా టూవీలర్, కైనెటిక్ లూనా త్రీవీలర్ లంబోర్ఘిణి బగ్గీరేంజ్ వేరియంట్లలో రానున్నట్లు సమాచారం. దీని ధర రూ. 50 వేల వరకు మార్కెటు వర్గాలు అంచనా వేస్తున్నాయి. లూనా ఎలక్ట్రిక్ అవతార్ లో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ బైక్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.