దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్.. అనతి కాలంలోనే ఇండియన్ కార్ల మార్కెట్‌లో తనదైన ముద్ర వేసింది. ఈ క్రమంలో.. కియా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు రాబోతుంది. 2022 జూన్ 2న కారును మార్కెట్‌లో రిలీజ్ చేయబోతుంది కియా. దీంతో ఆన్‌లైన్‌లో ఆడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. కియా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ముందస్తుగా కియా ఎలక్ట్రిక్ కారు ఈవీ 6ను బుక్ చేసుకోవచ్చు. టోకెన్ అమౌంట్‌గా మూడు లక్షల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.
కియా `ఈవీ6` కొనుగోలు చేయాలని భావించే వారు దేశంలోని 12 నగరాల్లో ఎంపిక చేసిన 15 డీలర్‌షిప్‌ల వద్ద రూ.3 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈవీ కారులో 77.4 కిలోవాట్ బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జ్‌తో 528 కిలోమీటర్లు ప్రయాణం చేయోచ్చని కకంపెనీ చెబుతోంది. కియా ఈవీ 6 ధర రూ.60 లక్షల వరకు ఉంచవచ్చని అంచనా. గరిష్ట వేగం గంటకు 192 కిలోమీటర్లు. కేవలం 5.2 సెకన్లలో 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లడం కియా `ఈవీ6` ప్రత్యేకత.
The fully electric Kia EV6 hit the racetrack & swayed India’s top auto journalists with its truly electrifying yet inspiring experience.
Catch the highlights from the #EV6ExperienceDrive of the global superstar.
Book Now-https://t.co/uKGsmYrpM6#TheKiaEV6 #MovementThatInspires
— Kia India (@KiaInd) May 27, 2022
350కేడబ్ల్యూహెచ్ చార్జర్ సాయంతో కేవలం 18 నిమిషాల్లో 10-80 శాతం వరకు బ్యాటరీ చార్జి చేయొచ్చు. ఆల్ వీల్ డ్రైవ్ (డబ్ల్యూడీ) సిస్టమ్ (ఇన్ సెలెక్ట్ ట్రిమ్స్), పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీపుల్ డ్రైవ్ మోడ్స్, ఫార్వర్డ్ కొల్లిషన్ యావాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్ తదితర 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నది.
The wheels of progress must be powered not just by fuel but an inspiration.
Presenting the most inspiring Kia ever – the fully electric Kia EV6.Book Now: https://t.co/hXAjX5EVJk
Set a Reminder for Launch Livestream: https://t.co/W6vUyKKtmm#Kia #TheKiaEV6 #MovementThatInspires— Kia India (@KiaInd) May 26, 2022
ఇది కూడా చదవండి: Tata Nexon EV Max: ఆకట్టుకుంటున్న టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు!
కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్/ సీఈవో తాయ్-జిన్‌పార్క్ స్పందిస్తూ.. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందులో కియా ముందు వరుసలో నిలుస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తెస్తున్నాం. అందులో భాగంగానే దేశీయ మార్కెట్‌లోకి `ఈవీ6`ఆవిష్కరిస్తున్నాం అని తెలిపారు.