భారతదేశంలో రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. టెలికామ్ రంగంలో సంచలనం సృష్టించిన సంస్థల్లో రిలయాన్స్ జియో ది అగ్రస్థానం. ఎయిర్ టెల్, విఐ, బీఎస్ఎన్ఎల్ లాంటి మరికొన్ని సంస్థలు ఉన్నప్పటికీ.. జియో మాత్రం ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్త కొత్త ఆఫర్లతో పాటు కొత్త కొత్త సేవలను సైతం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ 5G సేవలను దేశంలో ప్రారంభించాడు. అయితే అన్ని టెలికామ్ కంపెనీలు 5జీ సేవలను స్టార్ట్ చేయలేదు. కొద్దిరోజుల క్రీతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించింది జియో. ఈ సేవలను తాజాగా హైదరాబాద్ లో కూడా అందుబాటులోకి తెచ్చినట్లు జియో తెలిపింది. హైద్రాబాద్ తో సహా బెంగళూర్ లో సైతం ఈ సేవలు ప్రారంభించింది జియో కంపెనీ. మరి 5జీ సేవలు ఎలా యాక్టీవ్ చేయాలి? ఇంకేం ఆఫర్లు జియో తీసుకొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
రిలయాన్స్ జియో.. టెలికామ్ రంగంలోనే ఓ కొత్త చరిత్ర సృష్టించింది. జియో 5జీ నెట్ వర్క్ బీటా సేవలను ఇదివరకే దేశంలోని ముంబాయి, కోల్ కతా, ఢిల్లీ, చెన్నై, వారణాసి లాంటి ముఖ్య నగరాల్లో అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 5జీ సేవల్లో మరో ముందడుగు వేసింది జియో. మరో రెండు నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకోచ్చింది. తాజాగా హైద్రాబాద్, బెంగళూర్ లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ను అందుకుంటూ ముందుకు పోతున్నట్లు జియో కంపెనీ తెలిపింది. స్మార్ట్ ఫోన్లలో 500 Mbps నుంచి 1Gbps స్పీడ్ తో జియో 5జీ పనిచేస్తుందని పేర్కొంది.
ముందుగా మీ మెుబైల్ n77/n78/n8/n5/n28 బ్యాండో కాదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మెుబైల్ లో సెట్టింగ్స్ యాప్ కు పోయి.. వైఫై అండ్ నెట్ వర్క్స్ పై క్లిక్ చేయండి. తర్వాత సిమ్ అండ్ నెట్ వర్స్ మీకు కనిపిస్తుంది.. దానిపై మీరు క్లిక్ చేస్తే అక్కడ ప్రిఫర్డ్ నెట్ వర్క్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇక మీ ఫోన్ 5జీ కి సపోర్ట్ చేస్తే మీకు స్క్రీన్ పై 2జీ/3జీ/4జీ/5జీ అని కనిపిస్తుంది. మీరు 5జీ పై క్లిక్ చేస్తే ఆటోమెటిక్ గా యాక్టివేట్ అయిపోతుంది.
Welcoming Hyderabad and Bengaluru on True 5G ⚡️#JioTrue5G #True5G #Hyderabad #Bengaluru #Bangalore #JioTrue5GWelcomeOffer pic.twitter.com/jaVUfhjq58
— Reliance Jio (@reliancejio) November 11, 2022
హైద్రాబాద్, బెంగళూర్ లో ఉన్న జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది జియో. వారిని జియో వెల్ కమ్ ఆఫర్లోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ లో భాగంగా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా 1 Gbps వేగంతో, అన్ లిమిటెడ్ 5జీ డేటాను వినియోగించుకోవచ్చుని సంస్థ తెలిపింది. అదీ కాక 2023 కల్లా దేశంలోని ప్రతీ నగరం, తాలుకా, క్రింది స్థాయిల్లోకి జియో 5జీని విస్తరిస్తాం అని కంపెనీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 5జీ సేవలు విస్తృతం కావడంతో అనేక మెుబైల్ కంపెనీలు ఇప్పటికే 5జీ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.