ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ఇంకా వారమే సమయం ఉంది. ఇప్పటి నుంచే ఐపీఎల్ గురించి క్రికెట్ అభిమానులు ఎదురుచూపులు ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులకు జియో శుభవార్త చెప్పింది. క్రికెట్ అభిమానుల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది.
ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే అన్ని జట్లకు సంబంధించిన క్రికెటర్లు తమ క్యాంపులకు చేరుకుంటున్నారు. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ క్రికెట్ ప్రసార హక్కులను రిలయన్స్ కి చెందిన వాయికామ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మీరు ఫ్రీగా ఐపీఎల్ క్రికెట్ ని వీక్షించే అవకాశం కల్పించారు. లైవ్ స్ట్రీమింగ్ లో కూడా ఎన్నో ఆప్షన్స్ యాడ్ చేయబోతున్నారు. అయితే ఎంత ఫ్రీగా వచ్చినా చూసేందుకు డేటా కావాలి కదా? అందుకే రిలయన్స్ జియో క్రికెట్ అభిమానుల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ని తీసుకొచ్చింది.
జియో యూజర్లకు శుభవార్తను చెప్పారు. ఈ ఐపీఎల్ సీజన్ ని వీక్షేంచేందుకు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ని తీసుకొచ్చారు. క్రికెట్ అభిమానుల కోసం ఈ స్పెషల్ డైలీ 3 జీబీ డేటా లిమిట్ తో రూ.999, రూ.399, రూ.219 రీఛార్జ్ ప్లాన్స్ ని తీసుకొచ్చినట్లు తెలిపారు. మీరు రూ.999 ప్లాన్ తీసుకుంటే.. 84 రోజుల పాటు రోజుకి 3 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.241 విలువైన డేటా ఓచర్ లభిస్తుంది. ఆ వోచర్ ద్వారా మీరు అదనపు డేటాని పొందవచ్చు. అలాగే రూ.399 ప్లాన్ తో 28 డేస్ వ్యాలిడిటీతో డైలీ 3 జీబీ డేటా లభిస్తుంది. అదనంగా రూ.61 విలువైన డేటా వోచర్ లభిస్తుంది. ఆ వోచర్ ద్వారా ఫ్రీ డేటా పొందవచ్చు. రూ.219 ప్లాన్ లో 14 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రూ.25 వోచర్ లభిస్తుంది.
మీరు ఐపీఎల్ మ్యాచ్ లు చూడాలంటే కచ్చితంగా 3 జీబీ డేటా సరిపోదనే చెప్పాలి. అందుకే ఐపీఎల్ వేళ క్రికెట్ అభిమానుల కోసం ఈ రీఛార్జ్ ప్లాన్స్ మాత్రమే కాకుండా.. డేటా యాడాన్ ప్లాన్స్ కూడా విడుదల చేశారు. మీరు తీసుకున్న ప్లాన్ లో డైలీ లిమిట్ అయిపోతే మీరు ఈ యాడాన్ ప్యాక్స్ ని వాడుకోవచ్చు. రూ.222 ప్లాన్ బేస్ ప్లాన్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో 50 జీబీ డేటా లభిస్తుంది. రూ.444 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో 100 జీబీ డేటా లభిస్తుంది. రూ.667 డేటా యాడాన్ రీఛార్జ్ ప్లాన్ 90 డేస్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో 150 జీబీ డేటా లభిస్తుంది. జియో తీసుకొచ్చిన ఈ క్రికెట్ రీఛార్జ్ ప్లాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.