ఇప్పుడు దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ మాత్రమే కాదు.. బ్రాడ్ బ్యాండ్ సేవలు కూడా బాగా పెరిగాయి. చాలా మంది ఇళ్లలో వైఫై కనెక్షన్ పెట్టించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో జియో కంపెనీ నుంచి ఒక అద్భుతమైన బ్రాడ్ బ్యాడ్ బ్యాకప్ ప్లాన్ ఒకటి అందుబాటులోకి వచ్చింది.
ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇప్పుడు పల్లెటూర్లలో కూడా వైఫై సేవలను వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత డేటా వినియోగం బాగా పెరిగిందనే చెప్పాలి. అందుకే అందరూ వైఫై కనెక్షన్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా ప్రారంభం కానుంది. అంటే డేటా వినియోగం బాగా పెరుగుతుంది. ఇలాంటి తరుణంలో జియో సంస్థ ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. వైఫై సేవల్లో ఇదొక సంచలనమనే చెప్పాలి. ముఖ్యంగా ఇది క్రికెట్ అభిమానులకు బాగా ఉపయోగ పడుతుందనే చెప్పాలి.
ఇంటర్నెట్ సేవల్లో జియో కంపెనీ ఒక సంచలనం అనే చెప్పాలి. జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా కంపెనీలు వాటి టారిఫ్ లను తగ్గించాయి. అంతేకాకుండా స్పీడ్ ఇంటర్నెట్ లో కూడా జియో మంచి పోటీ ఇస్తోంది. ఇప్పటికే ఎన్నో బడ్జెట్ ఆఫర్లు పరిచయం చేసిన జియో.. ఇప్పడు ఫైబర్ సేవల్లో కూడా అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం నెలకు రూ.198కే మీరు జియో ఫైబర్ సేవలను పొందచ్చు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న ఈ తురణంలో ఇది ఎంతోమందికి కలిసొచ్చే ఆఫర్. అలాగే జియో ఫైబర్ కి కూడా ఇది కచ్చితంగా కొత్త కస్టమర్స్ తెచ్చిపెట్టే ఆఫర్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు జియో ఫైబర్ లో ప్రారంభ ప్రాన్ నెలకు రూ.399గా ఉండేది.
ఇప్పుడు దానిని మరిత తగ్గిస్తూ నెలకు రూ.198కే బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించనున్నారు. దీనిని బ్యాకప్ ప్లాన్ గా పిలుస్తున్నారు. ఈ రూ.198 బ్రాడా బ్యాండ్ ఆఫర్లో.. నెలకు మీకు 10 ఎంబీపీఎస్ స్పీడ్ తో అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. దీంతో మీకు ఫ్రీ ల్యాండ్ లైన్ కాల్స్ పొందో అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా వన్ క్లిక్ తో ఇంటర్నెట్ స్పీడ్ ని కూడా పెంచుకోవచ్చు. రూ.21 నుంచి రూ.152 వరకు వివిధ రకాల స్పీడ్, వ్యాలిడిటీతో స్పీడ్ లిమింట్ అప్ గ్రేడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ కి అదనంగా నెలకు రూ.200 వెచ్చిస్తే.. 14 ఓటీటీ యాప్స్, యూట్యూబ్, 550 లైవ్ ఛానల్స్ చూసేందుకు ఆస్కారం ఉంటుంది. జియో ఫైబర్ బ్యాకప్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
JIO FIBER INTRODUCES NEW BROADBAND BACK-UP PLAN!
Rs 198 for unlimited internet for a month but capped at 10Mbps with speed upgrade options if & when needed.
#JioFiber #Jio #IPL2023 #JioCinema pic.twitter.com/Sxy1hanGvR— MacSol Tech (@MacSolTech) March 27, 2023