ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్‌తో తన వినియోగదారులను ఆకట్టుకోవడమే కాక.. మిగతా టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది రిలయన్స్ జియో. తాజాగా మరో ధమకా ఆఫర్ ప్రకటించింది జియో. ఆ వివరాలు..
టెలికాంలో రంగంలోకి లేట్‌గా అడుగుపెట్టినప్పటికి.. అప్పటికే ఈ రంగంలో దిగ్గజాలుగా కొనసాగుతున్న కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది రిలయన్స్ జియో. మిగతా టెలికం కంపెనీలతో పోల్చితే.. ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్‌ను తీసుకొస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. కొత్త ప్లాన్స్‌తో పాటు.. పాత వాటిపైన అధిక లాభాలను కూడా జత చేస్తోంది. ఇక తాజాగా జియో తన కస్టమర్ల కోసం మరో బంపరాఫర్‌ని ప్రకటించింది. తన వినియోగదారుల కోసం జియో రెండు బెస్ట్ ప్లాన్స్‌ని తీసుకువచ్చింది. వీటిపైన 12 జీబీ ఫ్రీ డేటాని ప్రకటించింది. ఈ ప్లాన్స్‌పై రోజువారీ ప్రయోజనాలతో పాటుగా ఈ 12 జీబీ ఫ్రీ డేటా కూడా అదనంగా పొందుతారు. మరి ఆ రెండు కొత్త ప్లాన్స్ ఏవంటే..
రిలయన్స్ జియో తీసుకువచ్చిన ఈ రెండు కొత్త ప్లాన్స్ ఏవంటే.. రూ.899, రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ పైన ఈ 12జీబీ ఉచిత డేటా ఆఫర్‌ను యాడ్ చేసింది. మరి ఈ రెండు ప్లాన్స్ పూర్తి వివరాలు, వాటి వ్యాలిడిటీ ఎంత, ప్రతి రోజు ఎంత డేటా లభిస్తుంది.. ఎక్స్‌ట్రా ప్రయోజనాలు ఏం ఉన్నాయి.. మళ్లీ 12 జీబీ డేటా కోసం ప్రత్యేక రిచార్జ్ అవసరం ఉంటుందా వంటి పూర్తి వివరాలు..
జియో తాజాగా ప్రకటించిన రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అంతేకాక రోజు 2.5జీబీ డేటా.. 30 రోజుల పాటు లభిస్తుంది. 30 రోజులకు కలిసి 75జీబీ హై స్పీడ్ డేటాతో పాటు అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12 జీబీ హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, ప్రతిరోజు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లతో పాటుగా అన్ని జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్యాక్ ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా నెల రోజుల పాటు వ్యాలిడిటీ కలిగి ఉంది.
జియో ప్రకటించిన రెండో ప్లాన్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు అనగా మూడు నెలలు కాగా.. ప్రతి రోజు 2.5GB డేటా చొప్పున మొత్తం 90 రోజులకు గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, ఈ ప్యాక్‌లో కూడా ప్రతి రోజు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లతో పాటు అన్ని జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ యాక్సెస్ పొందే అవకాశం ఉంది.