ఐఫోన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అయితే రాను రాను క్రేజ్, డిమాండ్ అంతా బాగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు మార్కెట్ లో ఉన్నాయి. అప్పుడే ఐఫోన్ 15 సిరీస్ గురించి చర్చలు, వెతుకులాటలు మొదలు పెట్టేశారు. ఐఫోన్ 15 సిరీస్ కి సంబంధించిన ఫీచర్స్, లుక్స్ కి సంబంధించి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి.
యాపిల్ ఐఫోన్ కైనా.. మరే యాపిల్ ప్రొడక్ట్స్ కైనా ప్రంపచంవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు ఉంది. రాను రాను ఆ డిమాండ్, క్రేజ్ పెరుగుతోంది గానీ, తగ్గడం లేదు. అలాగే యాపిల్ కంపెనీ కూడా తమ స్టాండర్డ్స్ ని పెంచుకుంటూనే ఉంది. అలాగే ఐఫోన్ల రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయ. ఎంత రేట్లు పెరిగినా కూడా ఐఫోన్ల కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. పైగా వాటి కొనుగోళ్లు ఇంకా పెరుగుతున్నాయ. అందుకు కారణం.. యాపిల్ ప్రొడక్టులు ఇప్పుడు స్టేటస్ సింబల్ కూడా అయిపోయాయి. అందుకే మార్కెట్ లోనే కాకుండా.. సోషల్ మీడియాలో వాటికి సెర్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ 15 మోడల్ గురించి అప్పుడే ప్రచారాలు మొదలైపోయాయి.
నిజానికి కేవలం యాపిల్ ప్రొడక్టులు, ఐఫోన్లకు సంబంధించిన అప్ డేట్స్ ఇచ్చేందుకే చాలా వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటిలో ఒకటే తెగ వైరల్ అవుతోంది. ఐఫోన్ 15 సిరీస్ కి సంబంధించిన ఫీచర్స్ గురించి. అదేంటి అప్పుడే ఐఫోన్ 15 రిలీజ్ అవుతోందా? అని ఆశ్చర్యపోకండి. ఐఫోన్ 15 సిరీస్ వచ్చే ఏడాదిలోనే రిలీజ్ అవుతుంది. కానీ, ఆ సిరీస్ కి సంబంధించిన డిజైన్, ఫీచర్స్ అన్నీ లీకై ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటి ప్రకారం ఐఫోన్ 14 సిరీస్ కంటే కూడా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు మరింత స్టైలిష్ గా, అప్ డేటెడ్ గా ఉండనున్నాయి. పైగా ఈసారి ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు కూడా కాస్త ఖరీదుగానే ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది.
9to5Mac వెబ్ సైట్ వాళ్లు ఐఫోన్ 15 డిజైన్ ని, దాని ఫీచర్స్ లీక్ చేశారు. వారికున్న నమ్మకమైన సోర్సెస్ ద్వారా ఈ సమాచారం అందినట్లు చెప్పారు. వారి కథనం ప్రకారం ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్ లో కొత్తగా ఒక యాక్షన్ బటన్ రాబోతోంది. అందుకు సంబంధించిన రెండర్స్ కూడా వచ్చాయి. ఆ యాక్షన్ బటన్ అనేది ఒక ఫంక్షనల్ కీ అనమాట. మీరు డు నాట్ డిస్టర్బ్, కెమెరా, ఫ్లాష్ లైట్ ఇలాంటి పనులు చేసేందుకు ఒక షార్ట్ కట్ లాగా ఈ యాక్షన్ బటన్ ని వాడుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా బేస్ మోడల్ నుంచి ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ ని ప్రత్యేకంగా చూపించేందుకు కూడా ఈ బటన్ ని తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఇందులో యాపిల్ ఏ15 బయోనిక్ 12 జీబీ ప్రాసెసర్ ఉంటుందంటున్నారు. 6.1 ఇంచెస్ డిస్ ప్లే, మూడు 12 ఎంపీ రేర్ కెమెరాలు, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. ఇది 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ వస్తుందని చెబుతున్నారు.
We @9to5Mac received updated iPhone 15 Pro CADs showing the new button design, and less ridiculous cameras! It’s all starting to come together… pic.twitter.com/bDb4TGUrWB
— Ian Zelbo (@ianzelbo) April 26, 2023