ఐఫోన్ కొనడం కొందరికి అందని ద్రాక్షనే. ఎందుకంటే ఆ ఫోన్ ఖరీదు ఎక్కువ. కాకపోతే ఇతర ఫోన్‌లతో పోలిస్తే లుకింగ్‌తో పాటు, టెక్నాలజీ పరంగా ఐఫోన్‌లు చాలా అడ్వాన్స్‌గా ఉంటాయి. అందుకే ఖరీదైనా సరే ఆ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు యూజర్లు మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్14 కు సంబంధించి అదిరిపోయే న్యూస్ వచ్చింది. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ధరల్ని ఐఫోన్ 13 ధరలకే యాపిల్ అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 14 మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ. 80,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఐఫోన్ 14, 6 GB + 128 GB వేరియెంట్ ధర అమెరికన్ డాలర్లలో $799గా ఉంది. అంటే.. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 63వేలు. కానీ, మన దేశంలో GST, ఇతర ఇంపోర్ట్ డ్యూటీ ఛార్జీలు ఉన్నందున అదే ధరకు ఉండకపోవచ్చు. ఐఫోన్ 13 ఇండియాలో లాంచ్ అయినపుడు ధర రూ. 79,990గా ఉండేది. ఐఫోన్ 14 కూడా అదే ధరకు ఉండొచ్చు.
ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌లు సెప్టెంబర్ 13న విడుదల కానున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఐఫోన్ 14 ప్రాసెసర్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్‌ల వరకు ఏ15 ప్రాసెసర్ ఉండేది. అయితే.. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌లైన ఐఫోన్ 14, 14 మ్యాక్స్, 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్‌లలో ఏ15కు అడ్వాన్స్ వెర్షన్‌గా ఏ16 ప్రాసెసర్ ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ గేమింగ్ ఫర్మామెన్స్ కోసం.. 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్‌లలో మాత్రమే ఏ16 ప్రాసెసర్ ను వినియోగించినట్లు తెలుస్తోంది.
ఐఫోన్ 14 స్పెసిపికేషన్స్:
ఐఫోన్14 ఫోన్ 6.1 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. వీడియోలు చూసేందుకు, గేమ్స్ ఆడేందుకు 1170*2532 పిక్సెల్స్ రెజెల్యూషన్, 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక డ్యూయల్ సెటప్ రేర్ కెమెరా ఉంది. ఫోన్‌తో అద్భుతమైన ఫోటోల్ని తీసేందుకు 12ఎంపీ ప్లస్ 12ఎంపీ కెమెరాలు,సెల్ఫీలు దిగేందుకు, వీడియో కాల్స్ చేసుకునేందుకు ఫోన్ ముందు భాగంలో 12ఎంపీ ప్లస్ ఎస్‌ఎల్ 3డీ కెమెరాతో రానుంది. ఐఓఎస్ వీ 15 ఆపరేటింగ్ సిస్టం, 3115 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీంతో పాలు పలు రకాలైన కనెక్టివిటీ ఆప్షన్ ఉన్నాయి.
ఇదీ చదవండి: Upcoming Smartphones: ఆగష్టులో లాంచ్ కానున్న స్మార్ ఫోన్స్ లిస్టు ఇదే..!
ఇదీ చదవండి: అమెజాన్ బంపరాఫర్.. ఈ ఫోన్ కొంటే ఇయర్ బడ్స్ ఫ్రీ.. ఆఫర్ వివరాలివే!