సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ కు ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు షేర్ చేయడమే కాకుండా.. క్రియేటర్లగా కూడా మారి ఫేమస్ కావచ్చు. అలాగే ఇన్ స్టాగ్రామ్ ఎప్పుడూ సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూనే ఉంటుంది.
ప్రస్తుతం అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు, వాటిలో సోషల్ మీడియా అకౌంట్స్ ఉండటం సర్వసాధారణం అయిపోయింది. బ్యాంకులో ఖాతా ఉన్నా లేకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం అకౌంట్ తప్పకుండా ఉంటుంది. వారి జీవితంలో జరిగే సంఘటనలు, వారి టాలెంట్, ఇష్టాలు, అభిరుచులు ఇలా ప్రతి ఒక్కటి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఉంటారు. సెలబ్రిటీలు అయితే వారి అభిమానులతో టచ్ లో ఉండేందుకు ఈ మాధ్యమాలను ఉపయోగించుకంటూ ఉంటారు. అయితే వీటిలో ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ కు మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే.
మెటా సంస్థకు చెందిన ఇన్ స్టాగ్రామ్ 1 బిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ తో దూసుకుపోతోంది. ఇన్ స్టాగ్రామ్ తమ వినియోగదారులను అలరించేందుకు వారికి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ అంటే కేవలం ఫొటోలు అప్ లోడ్ చేయడం మాత్రమే కాదు.. కంటెంట్ క్రియేటర్లుగా కూడా మారచ్చు. అంతేకాకుండా క్రియేటర్లుగా మారిన వాళ్లు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ పేరిట నగదు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ స్టాగ్రామ్ కంటెట్ క్రియేటర్లకు ఎంతో ప్రాధాన్యం కూడా ఇస్తోంది. వారికి అప్ డేట్స్, ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం ఒక మేజర్ ఫీచర్ తీసుకొచ్చింది.
Today Mark Zuckerberg announced broadcast channels 📣 on @instagram!
Creators can use broadcast channels to share their latest updates with followers using text 🖊 photos 📸 videos 🎥 voice notes 🎤 polls 📊 and more.https://t.co/jWX7WoGBDi pic.twitter.com/E6DIlcHUPX
— Meta Newsroom (@MetaNewsroom) February 16, 2023
ఇన్ స్టాగ్రామ్ తాజాగా క్రియేటర్ల కోసం బ్రాడ్ కాస్టింగ్ కు సంబంధించి మేజర్ ఫీచర్ తీసుకొచ్చింది. ఛానల్స్ పేరిట బ్రాడ్ కాస్టింగ్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ లో క్రియేటర్లు కొన్ని ఛానల్స్ ను క్రియేట్ చేయచ్చు. వాటి ద్వారా క్రియేటర్లు వారి అభిమానులు, ఫాలోవర్స్ తో కాంటాక్ట్ అయ్యేందుకు, వారితో సమాచారం పంచుకునేందుకు వీలుంటుంది. దీనిలో టెక్ట్స్, వీడియో, ఫొటోలు, వాయిస్ నోట ద్వారా ముచ్చటించవచ్చు. అందుకు అభిమానులు కూడా వారి అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఛానల్స్ అంటే ఒక రకంగా పబ్లిక్ చాట్ అని చెప్పవచ్చు. అందులో మీ అభిప్రాయాలను కూడా పంచుకునే వీలుంటుంది.
Mark announced broadcast channels on @Instagram — a new public, one-to-many chat feature powered by @Messenger. Now creators have a low-key way to share updates with their followers as easily as sending a DM. Check out Mark’s channel here: https://t.co/ipc7snoPks pic.twitter.com/8QMtX3J6g2
— Loredana Crisan (@loredanacrisan) February 16, 2023
ఈ ఛానల్స్ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే.. టెలిగ్రామ్ లో ఎలా అయితే పబ్లిక్ గ్రూప్స్ ఉంటాయో.. అలాగే ఇన్ స్టాగ్రమా లో ఛానల్స్ పేరిట పబ్లిక్ చాట్ ఉంటుంది. టెలిగ్రామ్ తరహాలోనే క్రియేటర్లు చేసే ఈ ఛానల్స్ లో మీరు కూడా జాయిన్ కావచ్చు. అందరు అందులో సమాచారాన్ని పంచుకోవచ్చు. మీకు నచ్చిన మెసేజ్ కి మాత్రమే మీరు రెస్పాండ్ కావచ్చు. కాకపోతే ఇందులో రిప్లే ఇచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇది మార్క్ జుకరబర్గ్ సహా అమెరికాలో ఉన్న కొందరు క్రియేటర్లకు మాత్రమే టెస్ట్ చేసేందుకు అవకాశం కల్పించారు. త్వరలోనే అందరు క్రియేటర్ల కోసం అందుబాటులోకి తీసుకొస్తారని చెబుతున్నారు. మీరు ఒకసారి ఛానల్ లో చేరితే అది మీ డీఎం సెక్షన్ లో అన్ని చాట్స్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ తీసుకొస్తున్న ఈ ఛానల్స్ ఫీచర్ ఎంత వరకు ఉపయోగం? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
📣 Get updates from your fave creators with broadcast channels 💬
We’re testing a way for creators to invite followers to join their public chat for announcements and updates, where you can read and react to messages and vote in polls 🙌 pic.twitter.com/mP5XfGFdoE
— Instagram (@instagram) February 16, 2023