సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ కి క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు అందరూ ఇన్ స్టానే వాడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండటానికి, రీల్స్ చేసేందుకు ఇన్ స్టాని బాగా వాడుతున్నారు. ఈ ఇన్ స్టాగ్రామ్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పే ఒక ఘటన జరిగింది.
ఇన్ స్టాగ్రామ్.. ఈ సోషల్ మీడియా ఖాతాలేని స్మార్ట్ ఫోన్ యూజర్లు చాలా తక్కువగా ఉంటారేమో? ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేకపోయినా ఇన్ స్టాగ్రామ్ ఖాతా మాత్రం ఉంటోంది. రీల్స్, ఫొటోస్ అంటూ ఫుల్ హడావుడి చేస్తుంటారు. ఇంక సెలబ్రిటీలు అయితే చెప్పనక్కర్లేదు. వాళ్లు లేచిన దగ్గరి నుంచి చేసే ప్రతి పనిని ఈ ఇన్ స్టాగ్రామ్ లో పెడుతుంటారు. ఇప్పుడు ఈ ఇన్ స్టాగ్రామ్ కి ఉన్న క్రేజ్, రేంజ్ ఏంటో అందరికీ అర్థమైంది. ఎలా అంటే ఒక్క రోజులో ఇన్ స్టాగ్రామ్ కి ఏకంగా రూ.5,400 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ అంకె చూసి ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఆశ్చర్యపోయాయి.
ఇన స్టాగ్రామ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇండియాలో డబ్ స్మాష్, టిక్ టాక్ బ్యాన్ అయ్యాయో అప్పుడు అందరూ ఇన్ స్టా వైపు మళ్లారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో యూజర్లను పెంచుకుంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి ప్లాట్ ఫామ్స్ లో బ్లూ టిక్ ఉంటుందని అందరికీ తెలుసు. బ్లూటిక్ ఉంది అంటే దానిని వెరిఫైడ్ అకౌంట్ అంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్, సెలబ్రిటీలు, అధికారులు, రాజకీయ నాయకులకు ఈ బ్లూటిక్ ఇచ్చేవాళ్లు. అది అఫీషియల్ అకౌంట్ అని చెప్పేందుకు ఇలా చేసేవాళ్లు. అయితే ట్విట్టర్ ఇటీవల బ్లూటిక్ కోసం మీరు నెలవారి చందా కట్టాల్సిందే అని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎప్పుడైతే ఎలన్ మస్క్ ఈ ప్రకటన చేశారో.. ఆ తర్వాత కొన్నిరోజులకే జుకర్ బర్గ్ కూడా మెటా వెరిఫైడ్ ప్రోగ్రామ్ ని ప్రకటించారు. తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా బ్లూ టిక్ కోసం ఛార్జ్ చేస్తుందని వెల్లడించారు. మీకు వెరిఫైడ్ అకౌంట్ కావాలి అంటే మెటా బ్లూ టిక్ ని మీరు నెలవారీ చందాకి కొనుగోలు చేయాల్సిందే. ఎవరికైనా ఇకపై బ్లూ టిక్ కావాలంటే వాళ్లు నెలకు కొంత మొత్తాన్ని చెల్లించి ఈ బ్లూ బ్యాడ్జ్ తీసుకోవాల్సిందే. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ పంట పండింది. ఒక్క రోజులో 44 మిలియన్ బ్లూ చెక్ మార్క్స్ విక్రయించినందుకు మెటా సంస్థకు అక్షరాలా రూ.5,400 కోట్లు ఆదాయం వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ బ్లూ టిక్ వెరిఫైడ్ ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Instagram made $660 Million (₹5400 crores) in a day by selling 44 million blue checkmarks via Meta Verified program.
Mark Zuckerberg FTW.
— LetsCinema (@letscinema) April 5, 2023