భారతదేశంలో ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులు అని ఉంటాయని అందరికీ తెలిసిందే. సెక్యూరిటీ, నమ్మకం విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకే ఓటేస్తుంటారు. అయితే ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఐసీసీఐ బ్యాంకు మాత్రం కస్టమర్స్ నుంచి నమ్మకం, భద్రతా భావం ఉన్నాయనే చెప్పచ్చు. అలాంటి ఐసీసీఐ బ్యాంకు కస్టమర్లు ప్రమాదంలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి.
సాధారణంగా మనిషి ఆర్థిక లావాదేవీల్లో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషిస్తుంది. మీరు డబ్బు దాచుకోవాలన్నా, ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా, రుణం తీసుకోవాలన్నా ఇలా చాలా అవసరాలకు బ్యాంకులనే ఆశ్రయించాలి. గతంలో అయితే అంతా పేపర్ వర్క్ కాబట్టి మీ డబ్బు, మీ ఖాతా వివరాలు ఎంతో గోప్యంగా ఉండేవి. కానీ, ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ కారణంగా సైబర్ అటాక్స్ బాగా పెరిగిపోయాయి. బ్యాంకింగ్ రంగంలో ఇప్పుడు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అది నిజమా? కాదా? అనే విషయాన్ని కూడా తెలుసుకోకుండా బ్యాంకు కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఏకంగా 36 లక్షల మంది డేటా లీక్ అయిందంటూ వస్తున్న వార్తలు చూసి బెంబేలెత్తిపోతున్నారు.
బ్యాంకుల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు అని రెండు రకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అయితే మీ డబ్బుకు గ్యారెంటీ ఉంటుందని నమ్మకంగా ఉంటారు. ఆ తర్వాత ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఎక్కువ మంది కస్టమర్స్ నమ్మకాన్ని పొందిన బ్యాంకు ఐసీఐసీఐగా చెప్పచ్చు. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో సర్వీసెస్, సెక్యూరిటీ విషయంలో ఐసీసీఐ బ్యాంకులు ఎక్కువ మార్కులు పడుతుంటాయి. అలాంటిది ఆ బ్యాంకుకు సంబంధించి 36 లక్షల మంది డేటా లీక్ అయ్యిందంటూ వస్తున్న పుకార్లు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. సైబర్ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు సంబంధించిన డెబిట్, క్రెడిట్, పాన్, అకౌంట్ నంబర్లు, పాస్ వర్డ్స్ అన్నీ లీక్ అయ్యాయంటూ చెప్పుకొచ్చారు.
ఒక్క బ్యాంక్ కస్టమర్స్ మాత్రమే కాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బంది వివరాలు కూడా లీక్ అయ్యాయని తెలిపారు. బ్యాంక్ సిస్టమ్ లో వచ్చిన మిస్ కన్ఫిగరేషన్ వల్ల ఇదంతా జరిగినట్లు తెలియజేశారు. ఈ వార్తలపై ఐసీఐసీఐ బ్యాంక్ తీవ్రంగా స్పందించింది. ఆ వార్తలను కొట్టిపారేస్తూ.. 4 పాయింట్లను విడుదల చేసింది. “ఆర్టికల్ లో చెప్పిన విధంగా మిస్ కన్ఫిగరేషన్ అనే ప్రశ్నే లేదు. ఆ ఆర్టికల్ లో పబ్లిష్ చేసిన డాక్యుమెంట్స్ వ్యక్తిగతంగా అప్ లోడ్ చేసినవిగా ఉన్నాయి. వాటి వల్ల ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ లీక్ కాలేదు. ఎలాగైనా బ్యాంకు పేరుని వాడారు కాబట్టి ఆ వివరాలపై చర్యలు తీసుకుంటాం. ఆర్టికల్ లో చెప్పిన విధంగా 3.6 మిలియన్స్ కస్టమర్స్ డేటా లీక్ అయినట్లు ఎక్కడా ఆధారాలు లేవు” అంటూ ఐసీఐసీఐ బ్యాంక్ స్పందించింది. ఇది చూసిన తర్వాత కస్టమర్స్ అందరూ ఇవి కేవలం పుకార్లు మాత్రమే అనుకుని ఊపిరి పీల్చుకున్నారు.