ఐ ఫోన్ నుంచి తాజాగా విడుదలైన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లకు మంచి రెస్పాన్స్ లభించింది. మార్కెట్‌లో ఐఫోన్ 13 ప్రోమ్యాక్స్‌కు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా అందరూ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ సినిమాటిక్ వీడియో రికార్డింగ్‌కి ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు మరో యాపిల్ ఐ ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి. అదే ఐఫోన్ SE(2022) వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. మరి, ఆ వివరాలు ఏంటి? స్పెసిఫికేషన్స్ ఏంటని తెలుసుకుందాం.
ఐఫోన్ SE సిరీస్ అంటే బడ్జెట్ ఫోన్ అనే ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఆ సిరీస్ నుంచి 5G ఫోన్ అనగానే వినియోగదారులు సంతోషెం వ్యక్తం చేస్తున్నారు. ఓ టెక్ బ్లాగ్ వివరాల ప్రకారం ఐఫోన్ SE 5G వచ్చే ఏడాది మార్చి కల్లా మార్కెట్‌లో రిలీజ్ అవుతుందని తెలిపారు. దాదాపు 2022 ఫిబ్రవరి నుంచి మార్చి చివరికల్లా మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఐ ఫోన్ SE 2022 మోడల్‌లో కచ్చితంగా A15 బయోనిక్ చిప్‌తో 5G కనెక్టివిటీ ఆప్షన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. SE 2020 మోడల్ తరహాలోనే 4.7 రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుందని తెలుస్తోంది. హోమ్ బటన్, టచ్ ఐడీ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ X60 5G మోడెమ్ చిప్ ఉండే అవకాశం ఉంది. ఫ్రేమ్ విషయానికి వస్తే.. ఫ్లాట్ స్క్రీన్ ఉండచ్చు. ఐ ఫోన్ SE తరహాలోనే ఒకటే కెమెరాతో ఐఫోన్ SE 5G మోడల్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఐ ఫోన్ SE 5G(2022) మోడల్ ప్రొడక్షన్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చికల్లా మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.