ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ‘అయోనిక్ 6‘ పేరిట ఓ సెడాన్ కారును ఆవిష్కరించింది. అయోనిక్ 6 విషయానికొస్తే.. ఇది సెడాన్ మోడల్ కారు. వచ్చే ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని హ్యుందాయ్ వెల్లడించింది.
ఈ కారు గరిష్ట వేగం గంటకు 185 కి.మీ. కాగా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 610 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 800 వోల్టుల అల్ట్రా- ఫాస్ట్ బ్యాటరీ సిస్టమ్ లో 10% నుంచి 80% ఛార్జింగ్ కు కేవలం 18 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుంది. 12 రంగులలో అలరించనున్న హ్యుందాయ్ అయోనిక్ 6 రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఒకటి.. రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తోంది. ఇది 605 ఎన్ఎం టార్క్ వద్ద 320 హెచ్పే శక్తిని విడుదల చేస్తుంది. ఇందులో 77.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అమర్చారు. మరొకటి 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, సింగిల్ మోటార్ తో వస్తోంది. అయితే, దీని టార్క్, శక్తికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు.
#Hyundai Ioniq 6 EV Unveils…#IONIQ6 #HyundaiIndia #ElectricCars #ElectricVehicles pic.twitter.com/N1Dadil1eV
— EV TAK (@EVTAKK) July 15, 2022
అయోనిక్ 6 ముందు భాగంలో 700 పారామెట్రిక్ పిక్సెల్ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. ఫ్రంట్ బంపర్‌లో నిలువు ఫ్రేమ్స్ తో అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. సైడ్స్‌లో చాలా స్పోర్టీగా కనిపించే అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్స్ పై 4 రకాల పిక్సెల్ లైట్స్ వెలిగేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కారు స్థితిని బట్టి వాటి రంగు మారుతూ ఉంటుంది. ఇక.. వెనుక భాగంలో విండో క్రింద చక్కగా ఇంటిగ్రేట్ చేయబడిన స్పాయిలర్ మరియు దాని క్రింద డక్‌టైల్ స్పాయిలర్ ఉన్నాయి. అంతే కాకుండా, వెనుక బంపర్ కూడా ఫ్రంట్ బంపర్ మాదిరిగానే నిలువు ఫ్రేమ్స్ కలిగి ఉంది. అలాగే.. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, రియర్ స్పాయిలర్‌లో ఎల్ఈడి స్టాప్ ల్యాంప్స్ ఉన్నాయి.
NEWS: The Hyundai Ioniq 6’s technical specifications have been confirmed…>> https://t.co/39vspUblF7 pic.twitter.com/Rb6vnoIjZi
— Auto Express (@AutoExpress) July 14, 2022
సైడ్ మిర్రర్స్ ఉండవు..
ఈ కారు మోడల్ లో సైడ్ మిర్రర్స్ ఉండవు. వాటి స్థానంలో హెచ్‌డీ కెమెరాలు ఉంటాయి. ఇవి రోడ్డుకి ఇరువైపులా.. వెనుకగా వస్తున్న ట్రాఫిక్ ను వీడియో తీసి క్యాబిన్ లోపల స్క్రీన్ పై కనిపించేలా చేస్తాయి. బటన్-లెస్ డోర్ ప్యానెల్స్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, సింగిల్ డాష్ ఫ్రేమ్ ఉంటాయి.
Are you a fan of the 2024 @Hyundai Ioniq 6? https://t.co/3D6b5Iuztm pic.twitter.com/5t7ILXkuee
— Car and Driver (@CARandDRIVER) July 14, 2022
ప్రస్తుతం అయోనిక్ 6ని కొరియన్ మార్కెట్ లో మాత్రమే విడుదల చేశారు. కొరియన్ మార్కెట్ లో దీని ధర 55 మిలియన్ వోన్ లు (41,949.51 డాలర్లు), భారత కరెన్సీలో చెప్పాలంటే రూ. 33.50 లక్షలు. అయితే.. భారత మార్కెట్ లో దీని ప్రారంభ ధర దాదాపు రూ.40 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
టెస్లాకు చెందిన మోడల్ కూడా సెడాన్ సెగ్మెంట్ కావడంతో దానిపై పైచేయి కోసమే హ్యుందాయ్ ప్రత్యేకంగా అయోనిక్ ను తీసుకొస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హ్యుందాయ్ కంపెనీకి చెందిన అయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు మోడల్ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. 2030 నాటికి హ్యుందాయ్ 31 ఈవీ మోడళ్లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఇది కూడా చదవండి: Kia EV6: సూపర్బ్ లుక్, అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటున్న కియా ఎలక్ట్రిక్ కార్..!
ఇది కూడా చదవండి: Hyundai Alcazar SUV: మార్కెట్‌లోకి హ్యుండాయ్ న్యూ అల్కాజార్ ఎస్‌యూవీ.. అద్భుతమైన ఫీచర్స్!