ఎందుకు పనికిరావూ, నీ ఫేస్ కి అసలు వాల్యూ ఉందా, నీపై రూపాయి పెడితే అర్ధరూపాయి కూడా కొనరూ అని ఎవరైనా తిడుతున్నారా..? అయితే ఈ సారి చెప్పేయండి మీ ముఖానికి కూడా విలువుందని, దానికి విలువ కడుతున్నారని. మన మోహంతో లక్ష నుండి కోటి రూపాయల వరకు సొమ్ము చేసుకోవచ్చు. అవునండి, మీరు వింటున్నదీ నిజమే. అయితే అది ఎలా అనుకుంటున్నారా..? అయితే ఇది చదివేయండి.
ప్రస్తుతమంతా రోబోల కాలం. మర మనిషితో చాలా పనులు చేయించుకోవచ్చు. దీన్నే క్యాష్ చేసుకోబోతోంది రష్యాకు చెందిన ప్రోమోబోట్ అనే రోబో కంపెనీ ఉంది. ఇది అనేక రోబోలను తయారు చేస్తోంది. ఇప్పటి వరకు మగ, ఆడ రూపాల్లో రోబోలను తయారు చేసినప్పటికీ.. వాటికంటూ ఓ రూపం ఉండదు. అన్ని ఓకేలా ఉంటాయి. దీంతో ఓ ఆలోచన చేసింది. ఈ సంస్థ హ్యుమనైజ్డ్ రోబోలను మరింత అభివృద్ధి చేయాలని భావించింది. మనిషి మొహం ఆకృతి, వాయిస్ ల పేటెంట్ రైట్స్ కొనుగోలు చేయడం ప్రారంభించింది.
రోబోలు మనిషిలా మాట్లాడితే ముఖం కూడా మరింత సహజంగా, రియల్ స్టిక్ గా ఉంటాయి కాబట్టి.. ఈ రెండింటినీ ఉపయోగించి హ్యుమనైజ్డ్ రోబోలను తయారు చేయాలని భావిస్తోంది. 25 ఏళ్లు.. ఆ పైబడిన వారు ఇందుకు అర్హులు. మీ ముఖం, వాయిస్ రైట్స్ ను అందిస్తే.. ఆ సంస్థ కొంత నగదును చెల్లిస్తుంది. ఇందుకు రూ. 1, 50, 43,976 చెల్లిస్తామని సంస్థ ప్రకటించింది. అలా అని ముందుకు వచ్చిన వారందిరినీ ఈ సంస్థ సెలక్ట్ చేయదు. వివిధ పరీక్షల్లో ఎంపిక అయిన వారి రైట్స్ ను మాత్రమే కొనుగోలు చేస్తారు.
ఆ పరీక్షల్లో భాగంగా వంద గంటల పాటు ప్రసంగాలు, పలు ఫోటో షూట్లలో పాల్గొనాల్సి వస్తుంది. కొన్ని షరతులకు కూడా అంగీకరించాల్సి వస్తుంది. అన్ని నచ్చితే.. మీ ముఖం, వాయిస్ రైట్స్ తో కోట్లు సంపాదించింది. కానీ షరతులు మాత్రమే కొంచెం కఠినంగా ఉన్నాయి కదా. భవిష్యత్తులో అన్ని హ్యుమనైజ్డ్ రోబోలు రాబోతున్నాయి. మన ముఖాలతో మనల్నే పలకరించబోతున్నాయి. ఈ రోబోల తయారీ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.