మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు తెలుసా.. కొత్త కారు మీద రూ. 2 లక్షల వరకూ డిస్కౌంట్ పొందవచ్చునని. పాత కారు కాదు, ఎవరో కొని వాడింది అంతకంటే కాదు. కొత్త కారే. షోరూంలో కారే. దీని మీద రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అదెలాగో మీరే చూసేయండి.
కారు కొనాలనుకుంటే కంపెనీని బట్టి, మోడల్ ను బట్టి ప్రారంభ ధర రూ. 5 లక్షల నుంచి ఉంటుంది. కొంచెం బడ్జెట్ లో అనుకుంటే 12 నుంచి 15 లక్షలు ఉంటుంది. కొంచెం ఎగువ మధ్యతరగతి వారు రూ. 12 లక్షల వరకూ పెట్టుబడి పెట్టగలుగుతారు. మధ్యతరగతి వ్యక్తులైతే రూ. 5 లక్షల బడ్జెట్ లో వెళ్తారు. సరే ఎవరి బడ్జెట్ వారిది. అయితే ఆ బడ్జెట్ లో కొంత డిస్కౌంట్ వస్తే ప్రాణం లేచినట్టు ఉంటుంది కదా. డబ్బులు ఊరికే రావు కాబట్టి.. 10 వేలు తగ్గినా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటిది రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల డిస్కౌంట్ అంటే మాటలా? మీరు కొనే కారు మీద లక్ష నుంచి 2 లక్షల డిస్కౌంట్ కావాలంటే గనుక మీరు షోరూంకి వెళ్ళినప్పుడు ఇలా చేయండి.
ఏ షోరూంలో అయినా, ఏ వస్తువైనా అమ్మాలంటే డెమో వస్తువు ఒకటి డిస్ప్లేలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ వస్తువును చూపించే మిగతా వస్తువులను అమ్ముతారు. ఆ సమయంలో వాటిని కొనడానికి వచ్చిన వారు టెస్ట్ చేస్తుంటారు. కార్లు, బైకులు వంటి వాహనాలనైతే టెస్ట్ డ్రైవ్ చేస్తుంటారు. ఆ టెస్ట్ డ్రైవ్ చేసిన కార్లను కొనుగోలు చేస్తే మీకు భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. కొన్ని షోరూం కంపెనీలు తక్కువ డిస్కౌంట్ ఇచ్చి కస్టమర్లను మోసం చేస్తుంటాయి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంత అవగాహన కలిగి ఉండాలి. ఆ టెస్ట్ డ్రైవ్ కారుని కొనేముందు అది ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకు ఒక కారు విలువ రూ. 6 లక్షలు అనుకుంటే.. ఆ కారు 10 వేల కిలోమీటర్లు తిరిగితే గనుక మీరు ఆ కారు మీద రూ. 1,20,000 డిస్కౌంట్ పొందవచ్చు.
అదే రూ. 12 లక్షల కారు మీద ఐతే రూ. 2,40,000 డిస్కౌంట్ పొందవచ్చు. అంటే రూ. 9,60,000 కే కొత్త కారు సొంతం చేసుకోవచ్చు. అలానే రూ. 6 లక్షల కారును రూ. 4,80,000 కు పొందవచ్చు. ఫైనాన్స్ రూల్స్ ప్రకారం ఏదైనా టెస్ట్ డ్రైవ్ కారు 1000 కి.మీ. తిరిగితే దాని విలువ అనేది 2 శాతం తగ్గుతుంది. 5 వేల కి.మీ. తిరిగితే 10 శాతం, 10 వేల కిలోమీటర్లు తిరిగితే 20 శాతం తగ్గుతుంది. అలా అని సెకండ్ హ్యాండ్ కారు కాదు. కారు మొదటి ఓనర్ మీరే అవుతారు. టెస్ట్ డ్రైవ్ కార్లు కాబట్టి షోరూం వారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారు. మైనర్ రిపేర్లు ఉన్నా అవి సరి చేసి విక్రయిస్తారు. అయితే కొంతమంది టెస్ట్ డ్రైవ్ కార్ల ఓడోమీటర్ లో తిరిగిన మైలేజ్ ని జీరోకి పెట్టే అవకాశం ఉంది.
అలాంటప్పుడు ఓడోమీటర్ వ్యత్యాసాన్ని తెలుసుకునేందుకు కారు విక్రయించే వారిని వాహన హిస్టరీ రిపోర్ట్ ని అడగండి. లేదని చెబితే గనుక కారు విఐఎన్ నంబర్ ఒకటి ఉంటుంది. ఈ నంబర్ ద్వారా ఆన్ లైన్ లో కారు మైలేజ్ హిస్టరీ తెలుసుకోవచ్చు. మోసం చేసినట్టు అనిపిస్తే గనుక రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి ఫిర్యాదు చేయవచ్చు. ప్రతీ షోరూంలో ఇలా జరగకపోవచ్చు. కానీ తెలుసుకోవడం మీ బాధ్యత. అలానే అన్ని షోరూంలలో డెమో కార్లను విక్రయించకపోవచ్చు. విక్రయిస్తే గనుక ఈ ఫైనాన్స్ రూల్ ప్రకారం మీరు డిస్కౌంట్ లో కారు కొనుక్కోవచ్చు.