ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో ఆకర్షించిన అమెజాన్, ఇప్పుడు మరో ముందడుగు వేసింది. ఫోన్ కొంటే ఇయర్ బడ్స్ ఫ్రీ.. అనే ఆఫర్ కు తెరలేపింది. ‘Lava Agni 5G’ ఫోన్ కొంటే ‘Lava Buds Pro’ ఫ్రీ అంటూ బంపరాఫర్ ప్రకటించింది. లావా అగ్ని 5జీ అసలు ధర రూ.23,999 కాగా ఈ ఫోన్ పై 25 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే.. రూ. 17,990కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు రూ.1,799 విలువైన లావా ప్రోబడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు.
లావా అగ్ని 5జీ స్పెసిఫికేషన్స్:
కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికొస్తే.. ఇది 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS మరియు USB టైప్-C పోర్ట్‌తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
ఈ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. 64 మెగాపిక్సెల్ AI క్వాడ్ కెమెరా, 5000mAh బ్యాటరీ.
కెమెరా విషయానికి వస్తే.. ఇది 64 మెగాపిక్సెల్‌ల ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. దానితో ఎఫ్ / 1.79 సిక్స్-పీస్ లెన్స్ ఉంది. ఇది కాకుండా, కెమెరాలో 15-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్ ఇవ్వబడింది. మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇవ్వబడింది. ఇది మాత్రమే కాదు, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ సెటప్ ఉంటుంది. ఇందులో AI మోడ్, సూపర్ నైట్ మోడ్ మరియు ప్రో మోడ్ వంటి ప్రీ-లోడ్ చేయబడిన కెమెరా మోడ్‌లను కస్టమర్‌లు పొందుతారు.
పవర్ కోసం.. లావా ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీని అందించారు. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 90 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.
#LavaAgni5G launched in India :
Lava Agni 5G Specifications
📱6.78″ FHD+ 90Hz LCD (Side FS)
🔲 MTK Dimensity 810📸 64MP+ 5 UW🤦 + 2+ 2
🤳 16MP🔋5000mAH
⚡ 30W😱😍 3.5mm Jack
USB C
8+ 128GBLava AGNI Price Rs – 19,999
Introductory Price Rs – 17,999Your Thoughts ? pic.twitter.com/xWRofvSSXf
— Debayan Roy (Gadgetsdata) (@Gadgetsdata) November 9, 2021
ఇదీ చదవండి: Vivo Drone Camera: వివో సరికొత్త ఆవిష్కరణ.. ఫోన్లోనే డ్రోన్ కెమెరా..!
ఇదీ చదవండి: Moto X30 Pro: సినిమాలు షూట్ చేసేలా.. 200 మెగాపిక్సల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్!