‘వాట్సాప్..’ నిత్యం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఇది. ఉదయం నిద్రలేవగానే ‘గుడ్ మార్నింగ్’తో మొదలుపెడితే.. రాత్రి పడుకునే ముందు చేసే ‘గుడ్ నైట్’ వరకు అన్ని దీన్నించే. ఒక్క మెసేజులే కాదు.. ఫోటోలు/వీడియోలు పంపుకునే వెసులుబాటు, ఆడియో/వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్.. ఇలా లెక్కలేనన్ని ప్రయోజనాలు. అంతేకాదు.. వినియోగదారుల అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తుంటుంది. అందుకే ఈ యాప్‌కు ఇంత ఆదరణ అని చెప్పొచ్చు.
‘ప్రైవసీ’ ఇటవల ఎక్కువుగా వినపడుతున్న పేరిది. మన డేటా మనకు తెలియకుండానే ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ విషయం మనకూ తెలుసు.. అయినప్పటికీ అదే కొనసాగిస్తుంటాం. రెండ్రోజుల కిందట దాదాపు 50 కోట్ల వాట్సాప్ వినియోగదారుల నంబర్లు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లాయట. ఈ జాబితాలో భారత వాట్సాప్ వినియోగదారుల నంబర్లు కూడా ఉన్నాయి. అయినా మనమేం చేయలేం. చేయగలిగిందల్లా.. అందుబాటులో ఉన్న ‘ప్రైవసీ ఫీచర్లను ఉపయోగించడమే. ఈ క్రమంలో వాట్సాప్ ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయడం గురుంచి తెలుసుకుందాం. ఇందులో ఏముంది అనుకోవచ్చు. స్టేటస్ లో మీరు పర్సనల్ ఫోటోలు/వీడియోలు పెట్టుకున్నప్పుడు అవి పక్కదారి పట్టొచ్చు. కనుక మీకు అవసరమైన వారికి కనపడేలా.. మిగిలిన కనపడకుండా ఉండేలా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
వినియోగదారుల భద్రతకై వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది. మీ డేటా హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే.. ఎప్పటికప్పుడు యాప్ ను ఉప డేట్ చేసుకోవాలి. మీ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు పునరాలోచించుకోవడం ఉత్తమం.