ప్రతి ఒక్కరు తమకంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటారు. అలా కోరుకోవడం కూడా తప్పేమీ కాదు. అయితే గూగుల్ లోకి వెళ్లి మీ పేరును సెర్చ్ చేస్తే దాదాపు వందల కొద్దీ రిజల్స్ రావచ్చు. కానీ, ఈ సింపుల్ స్టెప్స్ గనుక మీరు ఫాలో అయితే.. మీ పేరు సెర్చ్ చేస్తే మీ వివరాలే వస్తాయి.
ప్రస్తుతం సమాజంలో గుర్తింపు అనేది అందరూ కోరుకుంటారు. తనకంటూ ఓ గుర్తింపు కావాలి, తన పేరు నలుగురికి తెలియాలి అనే ధ్యాస ఎక్కువగా ఉంటుంది. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ కోరిక చాలామందికి తీరిందనే చెప్పాలి. కొందరు సెలబ్రిటీలు కావడం వల్ల బాగా పాపులర్ అయ్యారు. కానీ, సాధారణ వ్యక్తులు గూగుల్ లో తమ పేరు కొట్టగానే వివరాలు రావాలని కోరుకోవచ్చు. అయితే అలా సాధ్యం కాదు అనుకుంటారు. కానీ, అది సాధ్యమే అని చాలా తక్కువ మందికి తెలుసు. మీ వివరాలతో కూడిన ఒక గుర్తింపును గూగుల్ అందిస్తోంది కూడా. అది పొందేందుకు చాలా సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు.
ప్రస్తుతం సమాజం మీద గూగుల్ ప్రభావం ఎంత ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న విషయానికి కూడా గూగుల్ మీదే ఆధారపడుతూ ఉంటాం. గూగుల్ మనం సెర్చ్ చేసే సమయంలో మన పేరు కూడా గూగుల్ వస్తే బాగుండు కదా అనే భావన కలగడం సహజమే. అయితే మీ పేరు టైప్ చేయగానే చాలా మంది వివరాలు రావచ్చు. కానీ, మీరు గూగుల్ పీపుల్ కార్డును తీసుకుంటే మాత్రం మీ పేరు టైప్ చేస్తే మీ వివరాలు మాత్రమే వచ్చేలా అవకాశం కూడా ఉంది. అందుకు మీరు గూగుల్ క్రోమ్ లో మీ పేరు మీద ఒక కార్డు తీసుకోవాలి. అది కూడా చాలా సింపుల ప్రాసెస్ అది.
మీరు గూగుల్ క్రోమ్ యాప్ ను ఓపెన్ చేయాలి. యాడ్ మీ టు సెర్చ్ అని టైప్ చేస్తే.. యాడ్ యువర్ సెల్ఫ్ టూ గూగుల్ సెర్చ్ అనే కాలమ్ ఓపెన్ అవుతుంది. అక్కడ క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ పేరు, మీరు నివసించే ప్రాంతం, ఆక్యుపేషన్, ఎడ్యుకేషన్, ఈమెయిల్, వెబ్ సైట్ వివరాలను యాడ్ చేయచ్చు. మీ సోషల్ మీడియా ఖాతాలను సైతం యాడ్ చేసుకోవచ్చు. అయితే మీ వ్యక్తిగత సమాచారాన్ని చూపించాలా, వద్దా అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ వివరాలకు సంబంధించి ప్రివ్యూ కూడాచూసుకోవచ్చు. లాస్ట్ లో మీ కార్డును సేవ్ చేసుకోవాలి. తర్వాత ఎప్పుడు మీ పేరు సెర్చ్ చేసినా కూడా మీ వివరాలు గూగుల్ లో ప్రత్యక్షమవుతాయి.