వాహనాలు వెదజల్లే కాలుష్యంతో వాతావరణంపై పెను ప్రభావం చూపుతుంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. దీంతో ప్రత్యామ్న్యాయల పై ప్రభుత్వాలతో పాటు వాహనదారులు కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో లెక్ట్రో ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.25వేలు నిర్ణయించింది.
దేశ విదేశాల్లోని అపీలు ఆటోమొబైల్ కంపెనీలు వినియోదారులను ఆకట్టుకోవడానికి వారి అభిరుచికి అనుగుణంగా ఆటోమొబైల్ సంస్థలు రోజుకో కొత్త రకం ఎలక్ట్రిక్ వాహనాల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. బ్యాటరీ, మోటార్లను అమర్చడంతో పాటు నాలుగు రకాలైన పెడల్, పెడలెక్, త్రొటిల్, క్రూయిజ్ రైడింగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సైకిల్ కు రెండు రకాలైన నార్మల్ మోడ్, ఎలక్ట్రిక్ మోడ్‌లు ఉన్నాయి. ఈ ఫీచర్స్‌తో కావాలనుకుంటే సైకిల్‌గా తొక్కొచ్చు లేదంటే ఎలక్ట్రిక్ డ్రైవింగ్ చెయ్యవచ్చు.
సైకిల్ ఆఫ్, ఆన్‌ను బట్టి మీరు ఎంత వేగంతో వెళ్లాలనేది చెక్ చేసుకోవచ్చు. ఈ సైకిళ్ల ప్రత్యేకత ఏంటంటే వీటిని మామూలు సైకిళ్లలా నడపొచ్చు. ఎలక్ట్రిక్ డ్రైవింగ్ కూడా చెయ్యవచ్చు. ఇందుకోసం ఓ బటన్ ఇచ్చారు. దాన్ని క్లిక్ చెయ్యగానే ఎలక్ట్రిక్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. అప్పుడు సైకిల్ దానంతట అదే వెళ్తుంది. స్పీడ్ ఎంత ఉండాలో నిర్ణయించుకోవచ్చు. ఈ సైకిళ్లకు బ్యాటరీ, మోటర్, కంట్రోలర్, త్రొట్టిల్, సెన్సార్ వంటివి ఉన్నాయి. పెడల్, పెడలెక్, త్రొటిల్, క్రూయిజ్ ఇలా నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.
ఈ వాటర్ ప్రూఫ్ డెకల్స్‌తో వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనైనా డ్రైవ్ చేయవచ్చు. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే ip67 లిథియం అయాన్ బ్యాటరీతో 3,4గంటల పాటు ఛార్జింగ్ పెట్టుకోచ్చు. 2ఏళ్లు వారెంటీగా ఉన్న ఈ సైకిళ్లను ఒక్కసారి ఛార్జింగ్ పెడిగే 25 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.
ఈ సైకిళ్లపై కిలోమీటర్‌కి 7పైసలే ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది. ఈ సైకిళ్ల గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. అందువల్ల వీటిని వాడేవారికి డ్రైవింగ్ లైసెన్స్, సైకిల్‌కి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటివి తప్పనిసరి కాదు.