ఐఫోన్ కొనాలి అని చాలామందికి ఉంటుంది. కానీ, అది ప్రమీయం ఫోన్. చాలా మంది దీనిని స్టేటస్ సింబల్ గా వాడుతుంటారు. యువతకి అయితే ఐఫోన్ కొనాలి అనేది వారి డ్రీమ్ గా పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఐఫోన్ పై ఫ్లిప్ కార్ట్ లో చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి.
ఐఫోన్.. యువతకే కాకుండా ఎంతోమందికి ఈ ఫోన్ కొనాలి అనేది కల. సెలబ్రిటీలు అయితే సర్వసాధారణంగా ఈ ఫోన్లనే వాడుతుంటారు. వాళ్లు మోడల్ మారిన ప్రతిసారి కొత్త మోడల్ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ మంది ఈ ఫోన్లను మార్చే సమయంలో కాస్త ఎక్కవగానే నష్టపోతుంటారు. పాత ఫోన్ కు తక్కువ మొత్తం ఎక్స్ ఛేంజ్ వాల్యూ రావడం, కొత్త ఫోన్ ధర ఎక్కవగా ఉండటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మాత్రం రూ.30 వేల వరకు గరిష్టంగా ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ఇవ్వడమే కాకుండా అదనంగా రూ.12 వేల వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. కొత్తగా ఐఫోన్ కొనాలి అనుకునే వారికి కూడా ఇదే మంచి అవకాశంగా చెప్పచ్చు.
ఐఫోన్ అనేది చాలా మందికి ఒక ఎమోషన్. కచ్చితంగా ఐఫోన్ కొనాలి అనుకుంటూ ఉంటారు. కానీ, ధర ఎక్కవ కాబట్టి కొనేందుకు ధైర్యం చేయలేరు. కానీ, ఇప్పుడు మాత్రం ఐఫోన్ 14 కొనాలి అనుకునే వారికి మంచి సమయం. ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ 14 మీద గరిష్టంగా రూ.12 వేలు డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఫ్లిప్ కార్టులో ఈ మోడల్ ఫోన్ మీద చాలా ఆఫర్లు ఉన్నాయి. ఐఫోన్ ఎల్లో 128 జీబీ వేరియంట్ ఎమ్మార్పీ రూ.79,900 కాగా ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో రూ.71,999కే అందిస్తున్నారు. దానికి అదనంగా HDFC బ్యాంక్ కార్డు ఉన్న వారికి రూ.4 వేలు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అంటే మొత్తం దాదాపు రూ.12 వేల వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి.
అలాగే ఎక్స్ ఛేంజ్ కింద గరిష్టంగా రూ.30 వేలు వరకు ఆఫర్ ఉంది. పైగా ఈ ఎల్లో వేరియంట్ చాలా యునిక్ గా కూడా ఉంటుంది. అందరు ఐఫోన్ యూజర్లలో మిమ్మల్ని కాస్త కొత్తగా చూపిస్తుంది. ఇంక ఈ ఐఫోన్ 14 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే, 12 ఎంపీ+ 12 ఎంపీ+ 12 ఎంపీ కెమెరాలు, ఏ15 బయోనిక్ చిప్, 6 కోర్ ప్రాసెసర్, బిల్ట్ ఇన్ స్టీరియో స్పీకర్స్, ఐవోఎస్ 16 వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంక స్టెబిలైజేషన్ వీడియో మోడ్, నైట్ మోడ్ వంటివి ఉండనే ఉన్నాయి. మీరు ఐఫోన్ కొనాలి అనుకుంటే ఈ ఆఫర్స్ చాలా మంచివనే చెప్పాలి.