గూగుల్ మ్యాప్స్ గురించి తెలియనివారు ఉండరు. తెలియని ప్రదేశంలో మీరు మీ యొక్క గమ్యస్థానానికి సులభంగా చేరుకోవడానికి గూగుల్ మ్యాప్ ఎంతగానో ఉపయోగపడతాయి. భారతదేశంలోని గూగుల్ మ్యాప్స్ యాప్‌కి ‘స్ట్రీట్ వ్యూ’ కొత్త ఫీచర్ ను తీసుకువస్తున్నట్లు గూగుల్ ఇటీవల ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా.. యూజర్లు తమకు కావలసిన రోడ్డు లేదా ఏదైనా ఏరియాను జూమ్ చేసి చూసినప్పుడు ఫలానా ప్రాంతం, ఫలానా వీధి అని స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు.. ఆ ప్రాంతంలో ఉన్న కేఫ్ లు, సాంస్కృతిక కేంద్రాలు, ఇల్లు, వీధులు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలు.. అన్ని తెలుసుకోవచ్చు.
భద్రతాపర సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో స్ట్రీట్ వ్యూ సేవలను కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ళ క్రితం బ్యాన్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆ సేవలకు అనుమతి దక్కడంతో జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా సంస్థలతో సంయుక్తంగా గూగుల్ మ్యాప్స్ ఈ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్, అహ్మద్ నగర్, అమృత్ సర్, బెంగళూరు, నాసిక్, పుణే, వడదోరా, చెన్నై, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది.
Google Maps is introducing a stunning new immersive view with AI assistance.
In order to create the new function, AI combined billions of aerial photos from Google Street View.
Beyond basic navigation, the aim is that users would be able to get a sense of an area before going. pic.twitter.com/F9rPihQSRw
— Lukas Ziegler (@lukas_m_ziegler) August 2, 2022
గూగుల్ మ్యాప్స్ లో స్ట్రీట్ వ్యూను ఉపయోగించే విధానం
గూగుల్ మ్యాప్స్ లో స్ట్రీట్ వ్యూ లేయర్‌ను ఉపయోగించే విధానం
Testing @googlemaps Street View in Bengaluru ..@Google #GoogleMaps #stretview pic.twitter.com/UgSax2RqYG
— Nipul ray (@nipulni2) August 2, 2022
ఇదీ చదవండి: Google Meet: ఇకపై ‘యూట్యూబ్’లోనే ఆన్‌లైన్ మీటింగ్స్ లైవ్ స్ట్రీమింగ్!
ఇదీ చదవండి: 39 Times Google: గూగుల్ కొలువు కోసం.. 39 సార్లు ప్రయత్నించి.. చివరకు..?