ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ సంస్థకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా గూగుల్ సంస్థ వినియోగదారులకు సరికొత్త ఫీచర్స్ అందించేందుకు ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ క్రోమ్ సరికొత్త ఫీచర్లను ప్రకటించింది.
తమ యూజర్లకు సరికొత్త ఫీచర్లు అందించడంలో గూగుల్ సంస్థ ముందుంటుందనే చెప్పాలి. తాజాగా ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ సూపర్ న్యూస్ చెప్పింది. ఏంటంటే గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకురాబోతోంది. బార్సెలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో గూగుల్ సంస్థ ఈ ఫీచర్స్ గురించి ప్రకటించింది. హోమ్ స్క్రీన్ మీద గూగుల్ సింగిల్ నోట్ విడ్జెట్, నోట్స్ క్రియేట్ చేయడం, వాచ్ ఫేస్ నుంచే టు డూ లిస్ట్ తయారు చేయడం, సరికొత్త ఏమోజీల ప్యాకేజ్ వంటి వాటిని తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్లను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ ఫీచర్ల సాయంతో సపోర్టెడ్ డివైజ్ లతో యాక్సెసబిలీటీ, కనెక్టివిటీ మరింత పెరుగుతుందని చెప్పారు.
గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 7 సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. సరికొత్త నోట్ విడ్జెట్ సాయంతో యూజర్లు హోమ్ స్క్రీన్ నుంచే నోట్స్, టుడూ లిస్ట్ ని మేనేజ్ చేయచ్చు. రిమైండర్స్ లో బ్యాగ్రౌండ్ కలర్స్, ఇమేజెస్ కూడా పెట్టుకునే అవకాశం కల్పిస్తోంది. స్మార్ట్ వాచ్ తో కూడా వీటిని మీరు సింక్రనైజ్ చేయచ్చు. వేర్ ఓఎస్ కోసం కూడా రెండు కొత్త షార్ట్ కట్స్ తీసుకొచ్చింది. వారి వాచ్ నుంచి కేవలం ఒక సింగిల్ ట్యాప్ తో నోట్స్, టుడూ లిస్ట్ తయారు చేయచ్చు. వీటిలో బాగా చెప్పుకోదగిన రెండో అప్ డేట్ అంటే నాయిస్ క్యాన్సిలేషన్. గూగుల్ మీట్ లో సరికొత్త నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తీసుకొస్తున్నారు. దీని సాంతో గూగుల్ మీట్ కాల్స్ లో ఆడియో క్వాలిటీ మరింత పెరగనుంది.
గూగుల్ ఫాస్ట్ పెయిర్ ఆప్షన్ కూడా తీసుకొస్తున్నారు. దీని ద్వారా గూగుల్ క్రోమ్ బుక్స్ కి బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ని కేవలం సింగిల్ ట్యాప్ కనెక్ట్ చేయచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఏమోజీలు, కస్టమైజ్డ్ ఫీచర్స్ తీసుకొస్తున్నారు. గూగుల్ బోర్డ్ లో ఏమోజీల మ్యాషప్ చేసి, రీమిక్స్ చేసి స్టిక్కర్స్ గా షేర్ చేయచ్చు. ఈ కొత్త ఫీచర్స్ సాయంతో వినియోగదారులు టెక్ట్స్, ఇమేజెస్, వీడియోల సైజ్ పెంచుకునేందుకు వీలుంటుంది. అలాగే కంటెంట్ సైజ్ ని డీఫాల్ట్ గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం క్రోమ్ బేటా వర్షన్ లో అందుబాటులో ఉంది. సెట్టింగ్స్ లోకి వెళ్లి యాక్సెసబిలిటీ ట్యాప్ చేసి ఫీచర్ ని ఆన్ చేయచ్చు. మార్చి నెలలో ఇది అధికారికంగా అందుబాటులోకి రానుంది.