ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు అందరూ ఈ ఏఐ టెక్నాలజీ గురించే మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ప్రముఖ టెక్ కంపెనీలు అన్నీ ఈ ఏఐ టెక్నాలజీపై వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ కృత్రిమ మేధతో ముప్పులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ కృత్రిమ మేధను ఉపయోగించి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రముఖ టెక్ కంపెనీలు ఈ ఏఐ టెక్నాలజీతో కొత్త చాట్ బాట్ లు తీసుకురావడం, తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఓపెన్ ఏఐకి మద్దతు ఇస్తూ మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గూగుల్ సంస్థ బార్డ్ ని తీసుకొచ్చింది. ఇంక మెటా, ట్విట్టర్ సంస్థలు సొంత ఏఐ చాట్ బాట్ లను సృష్టించే పనిలే తలమునకలై ఉన్నారు. అందరూ చెబుతున్నట్లుగా ఈ టెక్నాలజీతో ఎం ప్రయోజనమో అంత ప్రమాదం అనే మాటలు వాస్తవమే. ఈ మాట స్వయంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో తీవ్ర ముప్పు తప్పదని, కోట్ల మంది నిరుద్యోగులు అవుతారంటూ ఇప్పటికే చాలా మంది హెచ్చరించారు. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ అయితే ఓపెన్ గా లెటర్ కూడా రాశారు. అడ్వాన్స్ చాట్ జీపీటీ వ్యవస్థలను తక్షణమే నిలిపివేయాలంటూ మస్క్ డిమాండ్ చేశారు. మరోవైపు హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పోటీగా వస్తున్న చాట్ జీపీటీ వంటి చాట్ బాట్ లతో మానవాళికి ముప్పు పొంచి ఉందని టెక్నాలజీ నిపుణులు, గ్లోబల్ టెక్ అధిపతులు ఆందోళన వ్యక్తం చేయడం చూశాం. ఇప్పుడు ఆ జాబితాలోకి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా చేరారు. కృత్రిమ మేధతో తీవ్ర ముప్పు తప్పదంటూ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో హెచ్చరించారు. “ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో వచ్చే ముప్పు గుర్తొస్తే.. నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ఏఐ టెక్నాలజీని ప్రజా ప్రయోజన మార్గాల్లో ఉపయోగించేలా ప్రభుత్వాలు నియంత్రణ తీసుకురావాలి. సరైన మార్గంలో వెళ్లకపోతే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ముప్పు తప్పదు. టెక్నాలజీలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. వాటిని సరి చూసుకునే సమయం కూడా ఉండటం లేదు. అణ్వాయుధాల తరహాలోనే ఏఐ మీద కూడా నియంత్రణ ఉండాలి. అది ఏదో ఒక కంపెనీ తీసుకునే నిర్ణయం కాదు. ప్రపంచదేశాలు అంతర్జాతీయ స్థాయిలో ఒక కార్యచరణ రూపొందించాలి” అంటూ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. చాట్ జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీతో మానవాళికి ముప్పు తప్పదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In an interview with CBS’ “60 Minutes”, #Google’s CEO Sundar Pichai hinted that society isn’t prepared for the rapid advancement of AI.@sundarpichai warns society to brace for impact of #AI acceleration, says ‘it’s not for a company to decide’ https://t.co/3C1GvUSQwX pic.twitter.com/uWqYB7eAdv
— Alvin Foo (@alvinfoo) April 17, 2023