ప్రస్తుతం కాలంలో ఫోన్ పే తెలియని వారుండరు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆన్‌లైన్ ద్వారా నగదు లావాదేవీలు సాగించే వారిలో నూటికి 70 శాతం మంది ఫోన్ పేను విరివిగా వాడుతూ ఉన్నారు. ఫోన్ పేలో యూపీఐ ద్వారా లేదా ఫోన్ పే వాలెట్ ద్వారా నగదు లావాదేవీలు సాగించవచ్చు. కేవలం నగదు లావాదేవీలు మాత్రమే కాకుండా చాలా రకాల సౌకర్యాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఫోన్ పే వాడుతూ ఉన్నారు. ఇక, ఫోన్ పే తమ కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. క్రెడిట్ కార్డు వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫీచర్ రానే వచ్చింది. క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేసుకునే విధానాన్ని ఫోన్ పే తీసుకువచ్చింది. రూపే క్రెడిట్ కార్డు ఉన్న వారు ఈ సౌలభ్యాన్ని పొందవచ్చు.
క్రెడిట్ కార్డును ఫోన్ పే ద్వారా యూపీఐకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఏవైనా నగదు లావా దేవీలను యూపీఐకి అనుసంధానం అయిన క్రెడిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు. ఇక, ఫోన్ పే యూపీఐ ద్వారా దాదాపు 2 లక్షల రూపాయల క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లింపులు చేసేలా ఎన్‌పీసీఐతో భాగస్వామ్యం అయింది. కస్టమర్లతో పాటు వ్యాపారుల లావాదేవీలను సులభతరం చేయటానికి ఫోన్ పే ఈ విధానాన్ని తీసుకువచ్చింది. ఇందుకోసం క్రెడిట్ కార్డ్ ఈకో సిస్టంను అభివృద్ధి చేసింది. దాదాపు దేశ వ్యాప్తంగా 12 మిలియన్ల వ్యాపార అవుట్‌లెట్‌లు ఫోన్‌పేను వాడుతున్నాయి. మరి, ఫోన్‌పే అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.