మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని రవాణా సౌకర్యాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఒక ఎలక్ట్రిక్ బస్ విజయవాడ- హైదరాబాద్ రూట్ లో తిరుగుతూ అందరీ దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 350 కిలీమీటర్లు వెళ్లేంత కెపాసిటీ కలిగిన బస్ ఇది. దీని ఛార్జెస్ కూడా చాలా తక్కువనే చెబుతున్నారు. ఈ బస్సు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పెద్ద పెద్ద శబ్ధం లేకుండా ఎంతో సైలెంట్ గా, చాలా సౌకర్యవంతంగా ఈ బస్సు ప్రయాణం ఉన్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. దాని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ- హైదరబాద్ మధ్య న్యూగో పేరిట ఒక ఎలక్ట్రిక్ బస్ పరుగులు పెడుతోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి చర్చ నడుస్తోంది. ఎందుకంటే దీని ఫెసిలిటీస్, ప్రైసింగ్, కంఫర్ట్ అన్నీ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఈ బస్సులో 35 మంది ప్యాణికులు ట్రావెల్ చేయచ్చు. ఈ బస్ ని ఒక్కసారి ఛార్చ్ చేస్తే 350 కిలో మీటర్ల రేంజ్ ఉంటుందని చెబుతున్నారు. దీన్ని ఛార్జ్ చేసేందుకు సూర్యాపేట వద్ద 100 కిలో వాట్ సామర్థ్యంతో ఒక పెద్ద ఛార్జింగ్ పాయింట్ ని కూడా బిల్డ్ చేశారు. దానికోసం ప్రత్యేకంగా ఒక ట్రాన్స్ ఫార్మర్ నే ఏర్పాటు చేశారు. విజయవాడ- హైదరాబాద్ వెళ్లే బస్సులను ఆపి కాసేపు ఇక్కడ ఆగి ఛార్జింగ్ పెట్టుకుంటారు. వీటికి స్మార్ట్ కార్డులు ఉంటాయి. వాటిని బట్టి ఏ బస్సుకు ఎన్ని యూనిట్ల ఛార్జింగ్ పెట్టారు అనేది తెలుసుకుంటారు.
ఎలక్ట్రిక్ బస్ అనగానే ఎలా పోతుంది? ఎలా ఉంటుంది? అనే సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది 90 కిలీమీటర్ల స్పీడుతో దీనిని డ్రైవ్ చేస్తున్నారు. దీనిలో గేర్లు ఉండవు. డ్రైవ్, న్యూట్రల్, రివర్స్ అనే బటన్స్ ఉంటాయి. దీనిలో ఏసీ, టీవీ, ఛార్జింగ్ సాకెట్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. పుష్ బ్యాక్ సీట్లు కూడా ఉన్నాయి. దీని ధర విషయానికి వస్తే.. దాదాపు అన్ని ఏసీ సీటర్లతో పోలిస్తే.. అందుబాటు ధర అనే చెప్పాలి. దీనిలో టికెట్ రేటు దాదాపు రూ.450గా ఉంది. కాకపోతే ప్రస్తుతం ఈ బస్సులు బుకింగ్ కు అందుబాటులో చూపించడం లేదు. అందుకు గల కారణాలు కూడా ఏమీ తెలియరాలేదు. మళ్లీ ఎప్పుడు వీటిని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొస్తారో చూడాలి.