ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యునికేషన్ కోసం దాదాపు అందరూ ఆధారపడే అప్లికేషన్ వాట్సప్. నవంబర్ 1 తర్వాత నుంచి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లలో వాట్సప్ పనిచేయదని ఫేస్‌బుక్ కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా క్లౌడ్ కనెక్షన్ కూడా పోతుందని. క్లౌడ్ మెసేజెస్, ఫొటోలకు కూడా యాక్సెస్ పోతుందని స్పష్టం చేసింది. మరి ఆ ఆండ్రాయిడ్ వర్షన్లు, ఐవోఎస్ ఫోన్ల ఏంటో చూసేయండి మరి.
ఇదీ చదవండి: పునీత్ రాజ్ కుమార్ చనిపోవడం వెనుకున్న అసలు కారణాలు బయటపెట్టిన హీరో శ్రీకాంత్..
ఆండ్రాయిడ్ వర్షన్ 4.0.3 లేదా అంతకన్నా తక్కువ వర్షన్ ఉన్న ఫోన్లలో వాట్సప్ పనిచేయదు. మీ ఆండ్రాయిడ్ వర్షన్ తెలుసుకోవాలంటే మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి లాస్ట్ అబౌట్ ఫోన్ అని ఉంటుంది. అందులో మీ ఫోన్‌లో ఏ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో తెలుసుకోవచ్చు. అది 4.0.3 కన్నా తక్కువ వర్షన్ అయితే మీ వాట్సప్ మెసేజెస్, ఫొటోలు మొత్తం మరో డివైజ్‌లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఐవోఎస్ 9 లేదా దానికన్నా తక్కువ వర్షన్ ఫోన్లలో వాట్సప్ పనిచేయడం ఆగిపోతుంది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ SE ఫోన్లలో వాట్సప్ పనిచేయదు. మీకు అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటే మీ ఐవోఎస్ వర్షన్ 9 దాడి అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంటేనే మీరు మీ ఐఫోన్‌లో వాట్సప్‌ను ఉపయోగించుకోగలరు. క్లౌడ్ కనెక్షన్ కూడా కోల్పోతారు అనే వార్త ఇప్పుడు వాట్సప్ వినియోగదారులను కలవర పెడుతోంది. ఎప్పటినుంచో ఉన్న ఫొటోలు, ముఖ్యమైన మెసేజెస్ పరిస్థితి ఏంటని అంతా ఆందోళన చెందుతున్నారు.