ఐఫోన్.. ఎన్ని కంపెనీల ఫోన్లు ఉన్నా కూడా దీని క్రేజ్ వేరే లెవల్. చాలామంది మధ్యతరగతి వారికి ఈ ఫోన్ కొనుక్కోవాలనేది కల. కానీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతల దృష్ట్యా ఈ ఫోన్ కొనుక్కోలేకపోతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఐఫోన్లపై కూడా ఆఫర్లు వస్తూ ఉంటాయి. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు ఈ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. ఆ సమయాల్లో మధ్యతరగతి వాళ్లు కూడా ఈ ఐఫోన్ కొనుక్కుంటూ ఉంటారు. అలాగే ఐఫోన్ మారుస్తూ ఉండేవాళ్లు కూడా తక్కువ ధరలో మీ పాత ఐఫోన్ ని మార్చుకుని కొత్తది తీసుకోవచ్చు.
ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్ ని ప్రకటించింది. ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లు తీసుకొచ్చింది. ఈ ఆఫర్లతో మీరు ఐఫోన్ ను దాదాపుగా రూ.10వేలకు పైగా డిస్కౌంట్ తో పొందవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో 9 శాతం ఇన్ స్టెంట్ డిస్కౌంట్ ఇస్తోంది. అంటే రూ.79,900 ఎమ్మార్పీ కలిగిన ఐఫోన్ 14ని 9 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.72,499కే అందిస్తోంది. అంతేకాకుండా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కార్డులు వాడే వారికి రూ.4 వేలు డిస్కౌంట్ కూడా ఇస్తోంది. రూ.7 వేలు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
అలాగే ఫ్లిప్ కార్ట్ ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ని కూడా ఇస్తోంది. మీ పాత మొబైల్ ని ఎక్స్ ఛేంజ్ చేసి ఐఫోన్ 14 పొందేందుకు రూ.23 వేల వరకు తగ్గింపు ఇస్తోంది. మీ ఫోన్ మోడల్, కండిషన్ ను బట్టి తగ్గింపు అనేది ఆధారపడి ఉంటుంది. ఇంక ఐఫోన్ 14 విషయానికి వస్తే.. ఐఫోన్ 14 5 రంగుల్లో లభిస్తోంది. రెడ్, బ్లూ, స్టార్ లైట్, మిడ్ నైట్, పర్పుల్ కలర్స్ తో వస్తోంది. 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో లభిస్తోంది. మూడు 12 ఎంపీ కెమెరాలు కూడా ఉన్నాయి. 1 ఇయర్ వారెంటీ, బాక్స్ లో వచ్చే యాక్సెసరీస్ కు 6 నెలల వారెంటీ ఇస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఫ్లిప్ కార్టు నుంచి కొనుగోలు చేస్తే 7 రోజుల సెల్లర్ రీప్లేస్‌మెంట్ కూడా ఉంటుంది.